బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూర్‌లో ఎంఎఫ్ సెంటర్: హైదరాబాదులో యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/బెంగళూరు: ఐటీ దిగ్గజం యాపిల్ బెంగళూరులో ఎంఎఫ్ సెంటర్‌ను స్థాపించనుంది. హైదరాబాదులో డెలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తోంది. దాని ప్రారంభోత్సవం రేపు (గురువారం) జరుగనుంది. ఇందులో 150 మంది పనిచేస్తారు. కెటిఆర్ చెప్పబోయే పెద్ద వార్త కూడా ఇదే.

వినూత్న మొబైల్ యాప్‌లను తయారు చేసే భారత్‌లోని డెవలపర్లకు సహకరించేలా బెంగళూరులో సెంటర్ ప్రారంభించనున్నట్టు యాపిల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సెంటర్ కోసం ఎంత పెట్టుబడి పెట్టునున్నామన్న విషయాన్ని యాపిల్ వెల్లడింలేదు. 2017లో ఈ సెంటర్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఏమిటా 'గుడ్‌ న్యూస్‌'?: మంత్రి కేటీఆర్ చెప్పే ఆ న్యూస్ ఇదేనా?ఏమిటా 'గుడ్‌ న్యూస్‌'?: మంత్రి కేటీఆర్ చెప్పే ఆ న్యూస్ ఇదేనా?

భారత్‌లో స్టార్టప్ సంస్థల పుట్టినిల్లుగా ఉన్న బెంగళూరులో యాప్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటరును ప్రారంభించనున్నామని, భారత్‌లో ఇప్పటికే వేలమంది కొత్త తరం యాప్‌ల తయారీకి కృషి చేస్తున్నారని పేర్కొంది.

CEO Tim Cook in town, Apple announces iOS App Development Centre in Bengaluru

ఐఓఎస్ ఆపరేటింగ్ విధానంలో పని చేసేలా తయారయ్యే యాప్‌లకు ఇక్కడ పూర్తి సహాయ, సహకారాలు లభిస్తాయని యాపిల్ సంస్థ వెల్లడించింది. ఇక్కడికి వచ్చి యాప్‌లను తయారు చేసే వారికి ప్రతి వారమూ యాపిల్ నిపుణులు సలహా సూచనలు ఇస్తారని తెలిపింది.

కాగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ బుధవారం ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేశారని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. వ్యాపార సమావేశాల అనంతరం ఆయన వినాయకుడిని దర్శించుకున్నారు.

కాగా, తెలంగాణలోని హైదరాబాదులో యాపిల్ జూన్ నెలలో ఇన్నోవేషన్ కేంద్రాన్ని మొదలు పెట్టాలనుకున్న విషయం తెలిసిందే. కేటీఆర్ కూడా ఓ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్ బెంగళూరులో ప్రకటించారు.

English summary
Tech giant Apple will set up an app design and development centre in Bengaluru to support developers in India creating innovative mobile apps for its iOS platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X