హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జల్సాల కోసం గొలుసు దొంగతనాలు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గుర్నిహైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 22 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. మాసబ్‌ట్యాంక్ ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన మహ్మద్ ఫైసల్ (19), మహ్మద్ అజార్ (21), బంజారాహిల్స్ జహీరానగర్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్(24), కార్కానాకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ స్నేహితులు.

జల్సాలకు అలవాటు పడ్డ వీరు దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒంటరిగా వెళుతున్న మహిళలు, ఫోన్లు మాట్లాడుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ చేసుకొని బంగారు గొలుసులు, సెల్‌ఫోన్లను దోచుకొని వెళుతుండేవారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ తరహాలో పలు చోరీలు జరగడంతో బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పంజాగుట్ట క్రైం పోలీసులు శుక్రవారం ఉదయం డిఐ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పట్టుబడ్డారు.

ద్విచక్రవాహనంపై త్రిబుల్ రైడింగ్‌లో వెళుతూ పోలీసులకు చిక్కిన వీరు పోలీసులు ప్రశ్నిస్తున్న సందర్భంలో పొంతనలేని సమాధానాలు చెబుతూ తప్పించుకునేందుకు యత్నించారు. వెంటనే వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా వీరి దొంగతనాల చిట్టా విప్పారు. దీంతో వీరి వద్ద నుంచి బంగారు గొలుసులు, మూడు ద్విచక్రవాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం వీటి విలువ రూ. 22 లక్షల వరకు ఉంటుందని డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా వీరిపై పంజాగుట్టతో పాటు ఎస్సార్‌నగర్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో సైతం కేసులు ఉన్నట్లు తెలిపారు. ముగుర్నీ రిమాండ్‌కు తరలించిన పోలీసులు పరారీలో ఉన్న మహ్మద్ అజార్ గురించి గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏసిపి వెంకటేశ్వర్లు, సిఐ మోహన్‌కుమార్, డిఐ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

చైన్‌స్నాచర్ల అరెస్ట్

చైన్‌స్నాచర్ల అరెస్ట్

చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గుర్ని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 22 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

చైన్ స్నాచర్ల అరెస్ట్

చైన్ స్నాచర్ల అరెస్ట్

శుక్రవారం పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

చైన్ స్నాచర్ల అరెస్ట్

చైన్ స్నాచర్ల అరెస్ట్

మాసబ్‌ట్యాంక్ ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన మహ్మద్ ఫైసల్ (19), మహ్మద్ అజార్ (21), బంజారాహిల్స్ జహీరానగర్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్(24), ఖార్కానాకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ స్నేహితులు.

చైన్

చైన్

జల్సాలకు అలవాటు పడ్డ వీరు దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఒంటరిగా వెళుతున్న మహిళలు, ఫోన్లు మాట్లాడుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ చేసుకొని బంగారు గొలుసులు, సెల్‌ఫోన్లను దోచుకొని వెళుతుండేవారు.

English summary
Chain snatchers have been nabbed by Punjagutta police in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X