• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమెరికాలో ఎంజాయ్ చేసే ఆమె భార్యెలా అవుతుంది: చక్రి సోదరుడు, ఏడ్చేసిన శ్రావణి

By Pratap
|

హైదరాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కుటుంబ సభ్యుల వివాదం చిలికి చిలికి మరోసారి గాలివానగా మారుతోంది. సంవత్సరీకం చేస్తే వచ్చి దండం పెట్టుకోనటువంటి శ్రావణి చక్రికి భార్య ఎలా అవుతుందని, అమెరికాలో ఎంజాయ్ చేసే ఆమె భార్య ఎలా అనిపించుకుంటుందని చక్రి సోదరుడు మహిత్ వ్యాఖ్యానిస్తున్నారు.

హైదరాబాదులోని సోమాజిగుడాలో గల వరుణ్ సర్గం విల్లా వద్ద చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ వారితో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిత్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ చక్రి భార్య శ్రావణి ఏడ్చేసింది.

ఆ ఫ్టాట్‌ను అద్దెకు తీసుకున్న మాధవి అనే మహిళ ఖాళీ చేయడం లేదని, ఎనిమిది నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదని మహిత్ చెబుతూ ఆమెతో చేసుకున్న రెంటల్ అగ్రిమెంట్‌ను టీవీ చానెల్ యాంకర్‌కు చూపించారు. తమకు ముష్టి పడేస్తే తాము నోరు మూసుకుని పడి ఉండాలని శ్రావణి భావిస్తోందని ఆయన అన్నారు. వివాదం కోర్టులో ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూ తన తల్లి చక్రి మరణం విషయంలో నిందలు కూడా మోసిందని చెప్పారు.

Chakri's brother Mahith makes allegations against Shravani

తన సోదరుడు చక్రి శ్రావణి చెబుతున్నట్లుగా అప్పులు చేయలేదని, ఇన్ని ఆస్తులుండగా అప్పులు ఎలా చేస్తారని ఆయన అన్నారు. కోర్టు విచారణకు తమ లాయర్ హాజరవుతున్నప్పటికీ శ్రావణి లాయర్ హాజరు కావడం లేదని ఆయన అన్నారు. వంద సినిమాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారని, అటువంటి వ్యక్తి పనిమనిషికి జీతం ఇవ్వలేకపోతే శ్రావణి తండ్రి ఇచ్చాడని చెప్పడంలో ఏ మాత్రం అర్థం లేదని అన్నారు. తాము నిత్యం చస్తూ బతుకుతున్నామని అన్నారు.

కాగా, మహిత్ చేసిన ఆరోపణలను శ్రావణి ఖండించారు. అమెరికా నుంచి ఆమె టీవీ చానెల్ యాంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆస్తుల విషయమే అయితే వాళ్లు తమ లాయర్‌ను కలవవచ్చునని, తమ లాయర్ వచ్చినా వాళ్ల లాయర్ రాలేదని చెప్పారు. తాను పిలిస్తే కూడా వాళ్లు రాలేదని అన్నారు. తానేం చేయాలని అడిగారు. తాను డబ్బు మనిషినే అయితే తన ఆడపడుచు బిడ్డలు, ఇతర కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఎలా ఉండేవారని ఆమె ప్రశ్నించారు. ఈ సమయంలో ఆమె ఏడ్చేశారు.

తాను ఏమైనా ఫరవా లేదని వారు అనుకుంటున్నారని, వారికి డబ్బే కావాలని శ్రావణి అన్నారు. వారితో మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన తండ్రి వారితో మాట్లాడడానికి వస్తున్నాడని ఆమె చెప్పారు. తమ తండ్రితో మాట్లాడాలని వారికి సూచించారు.

Chakri's brother Mahith makes allegations against Shravani

తమకు వాటా ఉందని వారు కోర్టుకు వెళ్లారని, కోర్టు నిర్ణయం రాకుండా తమకు ఇవ్వాలంటే ఎలా అని శ్రావణి తరఫు న్యాయవాది గోకుల్ అన్నారు. వాయిదాలు అద్దెకు ఉంటున్నవారే కట్టారని ఆయన అన్నారు. ఒక సందర్భంలో కడితే తామే కడుతున్నామని చెప్పడం సరి కాదని అన్నారు. ఫ్లాట్‌పై భర్త చక్రి తీసుకున్న రుణం తీర్చుకోవడానికి అద్దె సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయాలని అద్దెకు

తల్లికి మరో కుమారుడు ఉన్నాడు, తల్లిని చూడాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉందని అన్నారు. చక్రి తల్లి పెన్షర్ అని, గత 15 నెలలుగా ఆయనే తల్లిని చూసుకుంటున్నాడని, అద్దెకు ఉంటున్నవాళ్లను అమాంతం ఖాళీ చేయాలని అడగడాన్ని ఏ చట్టమూ అంగీకరించదని అన్నారు.

ఫ్లాట్‌లోకి వెళ్లడానికి ఎవరికీ హక్కు లేదని అన్నారు. కోర్టుకు వెళ్లి ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. చక్రి ఆస్తి అని, అది తల్లికీ భార్యకూ చెందుతుందని అన్నారు. ఆస్తిని తమ్ముడికి కూడా పంచాలని అంటున్నారని, అది చట్ట ప్రకారం కూడా చెల్లదని అంటున్నారు. చక్రి తమ్ముడు మహిత్ గొడవ చేస్తున్నాడని అన్నారు. టీవీ9 న్యూస్ చానెల్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana music director Chakri's mother Vidyavathi and brother staged dharna in front of Varun Sargam villa at Somajiguda in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more