వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శిల్పా' సోదరుల ఇంటికి చంద్రబాబు, అసంతృప్తికి చెక్, ఎంఏల్ సి ఎన్నికలపై వ్యూహరచన

కర్నూల్ జిల్లా టిడిపి నాయకులు శిల్పా సోదరుల ఇంటికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్ళారు. కర్నూల్ జిల్లాలోని ఎంఏల్ సి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడ బాబు చర్చించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:టిడిపి కర్నూల్ జిల్లా అధ్యక్షుడు శిల్పా సోదరుల ఇంటికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్ళారు.కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎంఏల్ సి అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డిని బరిలోకి దింపింది టిడిపి.అయితే శిల్పా సోదరులు భూమానాగిరెడ్డి వైఖరిపై కొంత కాలం నుండి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు శిల్పా సోదరుల ఇంటికి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకొంది.

టిడిపిలోకి భూమా నాగిరెడ్డి చేరడాన్ని శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. భూమా నాగిరెడ్డి పార్టీలో చేరడాన్ని శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే బాబు మాత్రం భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకొన్నారు.

అయితే కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి పేరును ప్రతిపాదించింది.వైసిపి అభ్యర్థిగా గౌరు వెంకట్ రెడ్డి బరిలో నిలిచారు.

 Chandra babu naidu meeting with kurnool tdp leaders shilpa chakrapani reddy

శిల్పా చక్రపాణిరెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి వివాహం ఈ నెల 1వ, తేదిన హైటెక్ సిటీలో జరిగింది. బిజీ షెడ్యూల్ కారణంగా వివాహనికి హజరు కాలేదు చంద్రబాబునాయుడు.

శనివారం నాడు చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు వచ్చారు. జూబ్లిహిల్స్ లోని శిల్ప సోదరుల ఇంటికి వచ్చిన ఎపి సిఎం చంద్రబాబునాయుడు కార్తీక్ రెడ్డి దంపతులను బాబు ఆశీర్వదించారు.

చంద్రబాబునాయుడును శిల్ప సోదరులు సాదరంగా స్వాగతం పలికారు. కర్నూల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎంఏల్ సి ఎన్నికలపై బాబు చర్చించారని సమాచారం.

English summary
Andhra pradesh chief minister Chandra babu naidu meeting with kurnool tdp leaders shilpa chakrapani reddy, shilpa mohan reddy on saturday. Babu discussed about mlc elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X