వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ‌లో బాబు ప‌ర్య‌ట‌న‌..! సునిశితంగా గ‌మ‌నిస్తున్న గులాబీ శ్రేణులు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ :తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌రాకాష్ట‌కు చేరుతోంది. అదికార ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌చారాల‌తో తెలంగాణ జిల్లాలు హోరెత్తెతున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తో స‌హా బీజేపి కి చెందిన జాతీయ నేత‌లు తెలంగాణాలో ప‌ర్య‌టించ‌డ‌మే కాకుండా కాంగ్రెస్ పార్టీనుండి ముఖ్య నేత‌లు కూడా తెలంగాణ ప్ర‌చారంలో పాల్గొన‌డంతో రాజ‌కీయ వేడి ఒక్క‌సారిగా పెరిగిపోయింది. బీజేపి, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన సుమారు డ‌జ‌న్ మంది కీల‌క నేత‌లు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న‌ప్ప‌టికి చంద్ర‌బాబు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పైనే అదికార గులాబీ పార్టీ ద్రుష్టి కేంద్రీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజానికానికి చంద్ర‌బాబు ఏం చెప్తారు అనే అంశం ప‌ట్ల అప్ప‌మ‌త్తమైన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల చంద్ర‌బాబు పై చేస్తున్న వ్యాఖ్య‌క ప‌ట్ల చంద్ర‌బాబు ఏదైనా కౌంట‌ర్ ఇస్తారా అనే అంశంపై కూడా ప్ర‌త్యేకంగా ద్రుష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

 తెలంగాణ‌లో హోరెత్తుతున్న ప్రచారాలు..! మొహ‌రిస్తున్న జాతీయ నేత‌లు..!!

తెలంగాణ‌లో హోరెత్తుతున్న ప్రచారాలు..! మొహ‌రిస్తున్న జాతీయ నేత‌లు..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అన్నిపార్టీల అభ్యర్థులు ప్రతీ క్షణం ఓటర్లను ఆకరిష్ణిచేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గులాబీ నేతలు రకరకాల ఎత్తుగడలు వేస్తూ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ప్రజా సభల్లో పాల్గొంటూ మహాకూటమిపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. తమను గెలిపించక పోతే ప్రాజెక్టు నిర్మాణాలు ఆగిపోతాయని, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఓటర్లను సందిగ్ధంలో పడేస్తున్నారు.

తెలంగాణ‌లో కూట‌మి వ‌ర్సెస్ గులాబీ పార్టీ..! ఎవ‌రిది పైచేయి..!!

తెలంగాణ‌లో కూట‌మి వ‌ర్సెస్ గులాబీ పార్టీ..! ఎవ‌రిది పైచేయి..!!

మరోవైపు మహాకూటమిలోని కీలక నేతలు కూడా ఈ నాలుగు సంవత్సరాలలో గులాబీ నేతలు చేసిన పనులను తెలుపుతూ ప్రజలల్లో చైత‌న్యం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నాలుగున్న‌రేళ్లుగా తెలంగాణ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్ రావు ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు, ఇచ్చిన హామీలు ఎంత‌వ‌ర‌కు అమ‌లు చేసారు అనే అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు ప్ర‌తిప‌క్ష నేత‌లు.

 చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పై టీ శ్రేణుల ప్ర‌త్యేక ద్రుష్టి..! ఏంమాట్ల‌డ‌తార‌నే దానిపై ఉత్కంఠ‌..!

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పై టీ శ్రేణుల ప్ర‌త్యేక ద్రుష్టి..! ఏంమాట్ల‌డ‌తార‌నే దానిపై ఉత్కంఠ‌..!

ఇదంతా ఇలా ఉంటే ఇక మహాకూటమి తరఫున ప్రచారం చేయటానికి చంద్రబాబు రంగంలోకి దిగటం అదికార పార్టీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. 28,29 తేదీలలో తెలంగాణలలో చంద్రబాబు పర్యటన, ఎన్నికల ప్రచారం మరియు ఆయనతో కలిసి రాహుల్ గాంధీ కలిసి రోడ్ చేయబోతున్నారన్న వార్త ప‌ట్ల గులాబీ ఓ క‌న్నేసి ఉంచిన‌ట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడిన మాటలపై బాబు క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 చంద్ర‌బాబే కేంద్ర బిందువు..! క‌న్నేసిని టీఆర్ఎస్..!!

చంద్ర‌బాబే కేంద్ర బిందువు..! క‌న్నేసిని టీఆర్ఎస్..!!

ముఖ్యంగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డం పడుతున్నారని కేసీఆర్ మోపిన అభాండాలపై బాబు ఖచ్చితంగా స్పందించి వివరణ ఇస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన తమకు ఎంత వ‌ర‌కు శ‌రాఘాతంగా మారుతుంది అనే అంశం ప‌ట్ల స‌మాలోచ‌న‌లు జురుపుతున్న‌ట్టు స‌మాచారం. ఇదంతా చూస్తుంటే బాబు పర్యటన తర్వాత జరిగే పరిణామాలు వేరేలా ఉంటాయని, రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయే ప‌రిణామాల‌ను ఎలా అదిగ‌మించాల‌నే అంశం ప‌ట్ల క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Assembly elections will begin in Telangana within a few days. The promotional campaigns were booming. All party candidates are attempting to inspire voters every moment. More specifically, the pink leaders are taking campaigns with different tactics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X