వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబును ఓ గ‌ల్లీ లీడ‌ర్ గానే ప‌రిగ‌ణిస్తాం..! మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ‌లు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

KTR Meet The Press : KTR Sensational Comments On Chandrababu Naidu | Oneindia Telugu

హైద‌రాబాద్: దేశం క్షేమం కోసం చంద్ర‌బాబు నాయుడు అన్ని పార్టీలను కూడగట్టుకుని బీజేపీతో పోరాడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించే విధంగా రాజకీయాలు చేస్తున్నారని, నిజానికి ఆయన దేశం కోసం కాదని, తెలుగుదేశం మ‌నుగ‌డ కోసం పోరాడుతున్నారని టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అద్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు చెప్పారు.శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ దీ ప్రెస్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ జాతీయ స్ధాయిలో చేస్తున్న రాజకీయాలకు చంద్రబాబు చేస్తున్న రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

 దేశ రాజ‌కీయాల పేరుతో పార్టీని కాపాడుకుంటున్న బాబు..! కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు..!!

దేశ రాజ‌కీయాల పేరుతో పార్టీని కాపాడుకుంటున్న బాబు..! కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు..!!

టీఆర్ఎస్ ఆసక్తి ఆంధ్రప్రదేశ్ పట్ల ఖచ్చితంగా ఉంటుందని అక్కడ కూడా ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత దేశ రాజకీయాల్లో తెలుగుదేశంపార్టీ పాత్ర నామమాత్రం అయిపోతుందని తారకరామారావు అన్నారు. చంద్రబాబు నాయుడిని మీడియా మాత్రమే గొప్పవ్యక్తిగా చూస్తుందని కానీ మాకు, ప్రజలకు ఆయన గొప్ప వ్యక్తి కాదని ఒక గల్లీ లీడర్ తో సమానమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు..! అది గెలాబీ పార్టీతోనే సాద్య‌మ‌న్న రామ్..!!

దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు..! అది గెలాబీ పార్టీతోనే సాద్య‌మ‌న్న రామ్..!!


రోజురోజుకీ కేటీఆర్ ఆత్మ‌విశ్వాసం ఇనుమ‌డిస్తోంది. రాష్ట్రంలో చారిత్ర‌క విజయం అనంత‌రం టీఆర్ఎస్ పార్టీ లో కీల‌క ప‌ద‌వి ఆయ‌న్ను వ‌రించింది. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఛాలెంజ్ విసిరి వాటిని సాధించుకున్న కేటీఆర్ లోక్‌స‌భ‌కు మ‌రో ఛాలెంజ్ విసిరారు. త‌మ పార్టీ వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 16 సీట్లు సాధిస్తుంద‌ని ఘంటాప‌థంగా చెప్పారు. దేశ రాజ‌కీయాల్లో గులాబీ పార్టీ త‌ప్ప‌కుండా గుణాత్మ‌క మార్పు తీసుకొస్తుంద‌ని తేల్చి చెప్పారు కేటీఆర్.

తెలంగాణ‌లో అన్ని ఎంపీ స్థానాల‌ను గెలుస్తాం..! ప్ర‌ధానిని నిర్ణ‌యిస్తాం..!!

తెలంగాణ‌లో అన్ని ఎంపీ స్థానాల‌ను గెలుస్తాం..! ప్ర‌ధానిని నిర్ణ‌యిస్తాం..!!

2 కోట్ల మంది ఓటింగ్ పాల్గొంటే స‌గం మంది త‌మ‌కు ఓటేశారని, త‌మ‌కు 98 లక్షల ఓట్లు వ‌స్తే తర్వాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు అందులో స‌గం కూడా రాలేదని కేటీఆర్ అన్నారు. ఇంకో జాతీయ పార్టీ బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు రాలేదని, 100 స్థానాల్లో డిపాజిట్లు పోతాయని ఎన్నికలకు ముందే చెప్పానని కేటీఆర్ తెలియ‌జేసారు. ఆ పార్టీ తరఫున మోదీ, అమిత్‌షాయే ప్ర‌చారం చేసినా డిపాజిట్లు రావ‌ని త‌న‌కు ముందే తెలుసని అన్నారు. ఇది కేవ‌లం కేసీఆర్‌పై ఉన్న నమ్మకం మిన‌హా మ‌రేమీ కాద‌న్నారు కేటీఆర్.

 దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు క్షేమంగా ఉండాలి..! అందుకే జాతీయ రాజ‌కీయాల్లోకి టీఆరెస్..!!

దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు క్షేమంగా ఉండాలి..! అందుకే జాతీయ రాజ‌కీయాల్లోకి టీఆరెస్..!!

జాతీయ రాజ‌కీయాల గురించి కూడా కేటీఆర్ ప్ర‌స్థావించారు. 2019 లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కు అనుకున్న మెజారిటీ రాదు కాబ‌ట్టి 16 లోక్‌సభ స్థానాలు గెల‌వ‌బోయే టీఆర్ఎస్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అలాంటి త‌రుణంలో దేశ ప్రధానిని తెలంగాణ‌యే నిర్ణ‌యిస్తుంద‌న్నారు. తెలంగాణలో అమల‌వుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు అందాలంటే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తేనే సాధ్య‌మ‌ని వివ‌రించారు కేటీఆర్‌.

English summary
KTR made it clear that TRS's interest in Andhra Pradesh would be absolutely sure that a strong regional party would come to power. Tarakarama Rao said that after the 2019 general election, the role of the Telugu Desam Party in national politics will be nominal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X