• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'తెలంగాణని ఏలేందుకు బాబు కొత్త కుట్ర!', ఆ జడ్జిలు వీరే (పిక్చర్స్)

|

హైదరాబాద్: హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్ విధానం నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెరాస నేతలు, ఎంపీ కవిత తదితరులు కేంద్రం పైన, ఏపీ సీఎం చంద్రబాబు పైన విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వారి ప్రధాన టార్గెట్ మాత్రం చంద్రబాబే అని అంటున్నారు.

హైకోర్టు విభజన విషయంలో కేంద్రాన్ని తీవ్రంగానే ప్రశ్నిస్తున్నప్పటికీ.. చంద్రబాబు విభజన జరగకుండా ఒత్తిడి తెస్తున్నారని, అందుకే కేంద్రం తగ్గుతోందని తెరాస నేతలు మండిపడుతున్నారు. విభజన జరగకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కోర్టుల ద్వారా తెలంగాణను ఏలాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఎంపీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే ఏపీ జడ్జిలను తెలంగాణలో నియమించేలా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం, కేంద్రంలోని కొందరు ఆంధ్రాపెద్దలు తెలంగాణను కోర్టుల ద్వారా ఏలాలనే కుట్ర చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెరాస నేతలు, న్యాయవాదులు, జడ్జిలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్ కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కేంద్రం కౌంటర్ ఇచ్చింది. హైకోర్టు విభజనలో కేంద్రం జోక్యం ఉండదని, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని, విభజన చేసుకోవాలని, ఆ తర్వాత తమ వద్దకు వస్తే ప్రాసెస్ చేస్తామని కేంద్రం కౌంటర్ ఇచ్చింది.

కవిత

కవిత

తెలంగాణ, ఆంధ్ర విడిపోయినప్పటికీ ఇంకో 20-30 సంవత్సరాలు కోర్టుల ద్వారా తెలంగాణను ఏలాలనే కుట్రలు చేస్తున్నారని, ఆప్షన్ల పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆంధ్ర వాళ్లే జడ్జీలుగా ఉండేలా ఏపీ ప్రభుత్వం, కేంద్రంలోని కొందరు ఆంధ్ర పెద్దలు కుట్రలు అల్లుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆంధ్రాలో వందల పోస్టులు ఖాళీలున్నా కుట్రపూరితంగా ఆప్షన్లు ఇచ్చి తెలంగాణలోని చిన్న కోర్టుల్లో సైతం నింపివేసి బ్యాక్‌డోర్ ద్వారా తెలంగాణను శాసించే కుట్ర జరుగుతున్నదన్నారు.

కవిత

కవిత

హైకోర్టులో ముగ్గురే తెలంగాణ వాళ్లున్నారు. మన దగ్గర 335 పోస్టులు ఉంటే ఇప్పటికీ 97 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు మన కోర్టుల్లో ఉన్నారని, తెలంగాణలో కోర్టుల్లోని అన్ని చిన్న చిన్న పోస్టుల్లో కూడా ఆంధ్ర వాళ్లను నింపే ప్రయత్నం చేస్తున్నారని, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారిని ఆంధ్రలోనే ఉంచి, వయసు తక్కువ ఉండి, సర్వీసు ఎక్కువ ఉన్న వారిని తెలంగాణకు వేస్తున్నారు. ఆంధ్రలో జూనియర్, సీనియర్, సివిల్ జడ్జీలు అన్ని పోస్టులు కలుపుకొని వంద పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

కవిత

కవిత

అయినప్పటికీ అక్కడ పనిచేసే 130మంది ఇక్కడ జిల్లా కేంద్రాల్లో పనిచేసేందుకు ఆప్షన్లు పెడతారని, విభజన జరిగినపుడు ఎవరి ఇళ్లు వాళ్లు చక్కబెట్టుకోవాలని, కానీ ఇంకా కూడా మేం మీ దగ్గరనే ఉంటామని చెప్పడం, మీ సూర్యాపేటలో, మీ ఆర్మూర్‌లో, మీ వేములవాడలో మేమే ఉంటామమని, మేమే అంతటా కూడా అన్ని అంశాల్ని మేమే కంట్రోల్ చేస్తామనే వైఖరి నిజంగా చాలా భయంకరమైనదన్నారు.

కవిత

కవిత

తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. నిజమైన తెలంగాణ బిడ్డలు మీరైతే హైకోర్టు ముందుకు వచ్చి దీక్షలు చేయాలని, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని, కానీ హైకోర్టు విభజనలో కేంద్రం విభజన చేయకుండా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున సీఎం కేసీఆర్ చాలా మనోవేదన, బాధతో ఉన్నారని, కచ్చితంగా అవసరమైతే ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర దీక్ష చేస్తారని, ఒక సీఎం ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి సరిగా స్పందించడంలేదని దీక్ష చేస్తే అది అంతర్జాతీయ వార్త అవుతుందని కవిత హెచ్చరించారు.

చంద్రశేఖర ప్రసాద్

చంద్రశేఖర ప్రసాద్

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షులు, సిటీ సివిల్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జీలు పి చంద్రశేఖర్‌ప్రసాద్.

తిరుపతి

తిరుపతి

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన నాంపల్లి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌ తిరుపతి.

రమాకాంత్

రమాకాంత్

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన తెలంగాణ న్యాయాధికారుల సంఘం సభ్యులు డి రమాకాంత్.

రాజు

రాజు

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన కర్నూలు జిల్లా ఎక్సైజ్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి రాజు.

సరిత

సరిత

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన నిజామాబాద్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్ సరిత.

మురళీధర్

మురళీధర్

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన ఆదాయపు పన్ను శాఖ ట్రైబ్యునల్‌ జడ్జి టి మురళీధర్.

శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డి

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన జడ్జి సున్నం శ్రీనివాస రెడ్డి.

రాధాకృష్ణ చవాన్

రాధాకృష్ణ చవాన్

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎం రాధాకృష్ణ చావన్.

వేణు

వేణు

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సస్పెండైన మేడ్చల్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి జి వేణు.

వర ప్రసాద్

వర ప్రసాద్

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సోమవారం సస్పెండైన వరప్రసాద్.

రవీందర్ రెడ్డి

రవీందర్ రెడ్డి

సోమవారం ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేసిన హైకోర్టు, మంగళవారం మరో తొమ్మిది మంది జడ్జిలు సస్పెండ్ చేసింది. సోమవారం సస్పెండైన రవీందర్ రెడ్డి.

English summary
Chandrababu dawdling on High Court division, says MP Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X