హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ పై బాబు సెటైర్?: 'కుప్పిగంతులు' అంటూ మళ్లీ గాలి తీశారు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫెడరల్ ఫ్రంట్ బాబు అసంతృప్తి...!

అమరావతి: మొన్నీమధ్యే కదా!.. 'ఫ్రంట్ లేదు ఏమీ లేదు.. పార్టీలో ఏదో అంతర్గత సమస్య ఉన్నట్టుంది. దాన్ని కవర్ చేసుకోవడానికే కేసీఆర్ ఫ్రంట్ అని బయలుదేరిండు..' అని ఏపీ సీఎం చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ పై తీసికట్టు వ్యాఖ్యలు చేసింది. తాజాగా మళ్లీ అదే రకమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు బాబు. అయితే ఈసారి సూటిగా కాకుండా పరోక్షంగా కేసీఆర్ పై ఆయన సెటైర్ వేశారు.

బాబు సెటైర్:

బాబు సెటైర్:

వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశంతోపాటు పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు గతంలో కన్నా ఎక్కువ బలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. 'అందరిలా నేను కుప్పి గంతులు వేయను.దాని పరిస్థితులు, పరిమితులు నాకు తెలుసు' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్నాక.. ఇవి కేసీఆర్ ను ఉద్దేశించినవే అన్న అభిప్రాయం ఎవరికైనా కలగకమానదు.

ఫెడరల్ ఫ్రంట్ బాబుకు ఇష్టం లేదా?:

ఫెడరల్ ఫ్రంట్ బాబుకు ఇష్టం లేదా?:

దేశంలో అందరికంటే తానే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు.. కేసీఆర్ నేత్రుత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవడం రుచించడం లేదని తెలుస్తోంది. అందుకే సందర్భం వచ్చిన ప్రతీసారి ఏదో రకంగా దానిపై తీసికట్టు వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'చంద్రబాబు నాకు మంచి మిత్రుడే.. ఫ్రంట్ ఏర్పాటుపై ఆయనతోనూ మాట్లాడుతాం' అని కేసీఆర్ చెప్పిన కొద్దిరోజులకే ఆయన నుంచి దీనిపై ప్రతికూల స్పందన వచ్చింది. దీన్నిబట్టి కేసీఆర్ తో కలిసి నడవడానికి చంద్రబాబు ఏమాత్రం సుముఖంగా లేరని అర్థమవుతోంది.

మళ్లీ చెడినట్టేనా:

మళ్లీ చెడినట్టేనా:

ఓటుకు నోటు కేసు సమయంలో కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ బద్ద శత్రువుల్లా మారిపోయిన సంగతి తెలిసిందే. తెర వెనుక ఏం రాజీ జరిగిందో తెలియదు కానీ ఏపీ సీఎం చంద్రబాబు అమరావతికి మకాం మార్చేయడంతో ఇద్దరి మధ్య మళ్లీ మాటల తూటాలు పేలలేదు. సరికదా.. చాలా సందర్భాల్లో ఇద్దరు చంద్రుల మధ్య మంచి సఖ్యతే కొనసాగింది. కానీ కేసీఆర్ ఎప్పుడైతే ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనతో ముందుకు వచ్చాడో.. అప్పటినుంచి చంద్రబాబుకు, ఆయనకు మధ్య మళ్లీ ఆ సఖ్యత చెడుతున్నట్టుగానే కనిపిస్తోంది.

ఇదే తీరు కొనసాగుతుందా:

ఇదే తీరు కొనసాగుతుందా:

చంద్రబాబు-కేసీఆర్ ల మధ్య మునుపటి సఖ్యత ఇప్పుడు లేదు కాబట్టే.. ఓటుకు నోటు కేసు మళ్లీ తెర పైకి వచ్చిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏ ఒప్పందంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందో తెలియదు కానీ.. ప్రస్తుతం పదేపదే చంద్రబాబు ఫ్రంట్ పై చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్ కు కచ్చితంగా మంట పుట్టించేవే. దీంతొ వాటి ప్రభావం కూడా కేసుపై ఉండటంలో అనుమానం లేదంటున్నారు. చూడాలి మరి.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి.. కేసీఆర్, చంద్రబాబుల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందా.. లేక మరింత శత్రువులుగా మారుతారా?..

English summary
AP CM Chandrababu Naidu indirectly targeted Telangana CM KCR over federal front. Babu said iam not in hurry like someone to interfere in national politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X