వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబుది ప‌చ్చి మోసం..! మ‌రోసారి మొత్తుకున్న మోత్కుప‌ల్లి..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : చంద్ర‌బాబుది ప‌చ్చి మోసం : మోత్కుప‌ల్లి || Oneindia Telugu

హైదరాబాద్ : ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై మాజీ టిడిపి నేత మోత్కుప‌ల్లి నర్సింహులు మ‌రోసారి మండిప‌డ్డారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ మ‌టుమాయం కావ‌డానికి ఎవ‌రో కార‌ణం కాద‌ని,కేవలం బాబు స్వార్థ రాజ‌కీయాల‌కోస‌మే తెలంగ‌ణ‌లో తెలుగుదేశం పార్టీ క‌నుమ‌రుగైంద‌ని ఘాటుగా ఆరోప‌ణ‌లు చేసారు. తెలంగాణలో టీడీపీ పార్టీని భూస్థాపితం చేసిన టీడీపీ నాయకులు చంద్రబాబు ఆంధ్రాలో ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రమూ ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం చంద్రబాబునాయుడేనన్నారు.

రాష్ట్రంలో టీడీపీని నమ్ముకుని మిగిలున్న ఒకరిద్దరు నాయకులు ఏమై పోవాలని ప్రశ్నించారు. మాల, మాదిగలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు కాపులకు ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మోత్కుపల్లి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు మోసం, కుట్ర‌, ద‌గా, వెన్నుపోటు తదితరాలతోనే తెలంగాణ నుంచి టీడీపీ మాయమైందని అన్నారు.

chandrababu is cheater..! once agian Mothkupally Narsimhulu fired..!!

ఒకప్పుడు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న తెలంగాణ, అదే తెలంగాణ‌లో పార్టీకి ఇప్పుడీ పరిస్థితి దాపురిస్తుంద‌ని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. పార్టీ కోసం తన జీవితాన్నే ధారపోశానని, విభజన తరువాత టీడీపీ జాతీయ పార్టీగా ఉంటుందని భావిస్తే, కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబు పారిపోయారని ఘేటుగా విమర్శలు గుప్పించారు మోత్కుప‌ల్లి న‌ర్పింహులు.

English summary
Former TDP leader Motukupalli Narsimhalu, once again criticized the ap Chief Minister Chandrababu Naidu. In Telangana, the Telugu Desam Party is not the cause of any sort of exclusion, but only for Babu's selfish politics. he alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X