వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రమణకు చంద్రబాబు ఫోన్, రేవంత్ రెడ్డి గురించి ఆరా, తలసాని ఇంట్లో కేటీఆర్‌ను కలవడంపై

తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేశారని తెలంగాణ టిడిపి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు,

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేశారని తెలంగాణ టిడిపి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.

అంతా వృథా: బిజెపిని దెబ్బకొట్టిన రేవంత్ రెడ్డి నిర్ణయం, వణుకు, టిడిపి క్లోజ్!అంతా వృథా: బిజెపిని దెబ్బకొట్టిన రేవంత్ రెడ్డి నిర్ణయం, వణుకు, టిడిపి క్లోజ్!

ఈ భేటీకి ఎల్ రమణ, కొత్తకోట దయాకర్ రెడ్డి, ఉమామాధవ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు.

ఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలుఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలు

చంద్రబాబు నాతో మాట్లాడారు

చంద్రబాబు నాతో మాట్లాడారు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేశారని ఎల్ రమణ తెలిపారు. తనకు ఫోన్ చేసి అన్ని వివరాలు కనుక్కున్నారని వెల్లడించారు.

సరిగ్గా వ్యవహరిస్తున్నారా?

సరిగ్గా వ్యవహరిస్తున్నారా?

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై సరిగా వ్యవహరిస్తున్నారా అని చంద్రబాబు అడిగారని ఎల్ రమణ తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన అడిగి తెలుసుకున్నారన్నారు.

తాజా రాజకీయ పరిస్థితులపై

తాజా రాజకీయ పరిస్థితులపై

తాజాగా, తమ భేటీలో తాజారాజకీయ పరిస్థితులపై చర్చ జరుపుతున్నామని ఎల్ రమణ తెలిపారు. నవంబర్ మొదటి వారంలో టిడిపి జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని తెలిపారు.

తలసాని ఇంట్లో కేటీఆర్‌తో భేటీపై..

తలసాని ఇంట్లో కేటీఆర్‌తో భేటీపై..

తాను మంత్రి తలసాని ఇంట్లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని ఎల్ రమణ స్పష్టం చేశారు. తెరాస, ఇతర పార్టీల నాయకులను తాము కలిసే ప్రసక్తి లేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను కేసీఆర్‌ను కలవలేదన్నారు.

రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చ

రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చ

తెలంగాణ టిడిపి నేతల భేటీలో ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అంశంపై చర్చించారు. కాగా, చంద్రబాబు కూడా రేవంత్ గురించి ఆరా తీశారని తెలుస్తోంది.

English summary
Andhra Pradesh Chief Minister and TDP chief Nara Chandrababu Naidu asked TDP working president Revanth Reddy issue from Telangana TDP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X