వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ ఎపిసోడ్: టిటిడిపి నేతలతో రేపు బాబు మీటింగ్, సండ్రకు ఎల్పీనేతగా ఛాన్స్

రేవంత్‌రెడ్డితో పాటు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో టిడిపి జనరల్ బాడీ సమావేశాన్ని నవంబర్ 2వ, తేదిన హైద్రాబాద్‌లో నిర్వహించనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్‌రెడ్డితో పాటు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో టిడిపి జనరల్ బాడీ సమావేశాన్ని నవంబర్ 2వ, తేదిన హైద్రాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే పలు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించనున్నారు. మరో వైపు టిడిఎల్పీ నేతగా సండ్ర వెంకటవీరయ్య పేరును చంద్రబాబునాయుడు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

Recommended Video

TRS అంచనాలు రివర్స్: ఎదురులేని రేవంత్

రేవంత్ ఎపిసోడ్: టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌, నేతలకు బంపరాఫర్లురేవంత్ ఎపిసోడ్: టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌, నేతలకు బంపరాఫర్లు

రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కీలకమైన నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి అక్టోబర్ 31వ, తేదిన కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ పరిణామాలతో పార్టీని బలోపేతం చేసేందుకు టిడిపి నాయకత్వం చర్యలను చేపట్టింది.

సీతక్క టిడిపికి ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్, ఫోన్ స్విచ్ఛాప్ అందుకేనా?సీతక్క టిడిపికి ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్, ఫోన్ స్విచ్ఛాప్ అందుకేనా?

రేవంత్‌రెడ్డి పార్టీని వీడడంతో చోటుచేసుకొన్న పరిణామాలతో పాటు, తెలంగాణలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలనే విషయమై పార్టీ నేతలతో చర్చించనున్నారు చంద్రబాబునాయుడు. ఈ మేరకు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బతెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బ

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలు

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలు

రేవంత్‌రెడ్డి పార్టీని వీడడంతో చోటుచేసుకొన్న పరిణామాలపై ముఖ్యమైన నేతలతో చంద్రబాబునాయుడు నవంబర్ 2వ, తేదిన హైద్రాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రేవంత్‌తో పాటు బయటకు వెళ్ళిన నేతల కారణంగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకర్గాల ఇంచార్జీలుగా కొత్తవారిని నియమించనున్నారు. పార్టీ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి కొత్తవారి పేర్లను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

రేవంత్ ఘటనపై క్యాడర్‌కు దిశానిర్ధేశం

రేవంత్ ఘటనపై క్యాడర్‌కు దిశానిర్ధేశం

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలపై చంద్రబాబునాయుడు క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయనున్నారు. రేవంత్‌రెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్న విషయాన్ని కూడ పార్టీ క్యాడర్‌ దృష్టికి తీసుకురానున్నారు. అదే సమయంలో పార్టీ వైఖరిని కూడ స్పష్టం చేయనున్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పట్ల పార్టీ ఏ వైఖరిని తీసుకోనుందోననే విషయమై క్యాడర్‌కు స్పష్టత ఇవ్వనున్నారు.

టిడిఎల్పీ నేతగా సండ్రను ప్రకటించే అవకాశం

టిడిఎల్పీ నేతగా సండ్రను ప్రకటించే అవకాశం

టీడీఎల్పీ నేత పేరును నవంబర్ 2వ, తేదిన చంద్రబాబునాయుడు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో టిడిపికి ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ తరుణంలో పార్టీ సీనియర్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్యకు టిడిఎల్పీ నేతగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారంలో ఉంది.రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు పార్టీకి కూడ రాజీనామా చేసిన నేపథ్యంలో టిడిఎల్పీనేతను ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది.

చావు దెబ్బతిన్న టిడిపి

చావు దెబ్బతిన్న టిడిపి

తెలంగాణ ఉద్యమం టిడిపిని తెలంగాణలో చావుదెబ్బతీసింది. ఈ ఉద్యమం కారణంగా టిడిపికి చెందిన ముఖ్య నేతలు టిఆర్ఎస్‌లో చేరారు. అంతేకాదు ఈ ఉద్యమ ప్రభావంతో ఆ పార్టీ బలహీనపడింది. అయితే టిడిపి అనుసరించిన కొన్ని ఎత్తుగడలు కూడ రాజకీయంగా తెలంగాణలో టిడిపిని తీవ్రంగా నష్టపరిచాయి. ఈ2014 ఎన్నికల సమయంలోనూ,ఆ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల్లో కూడ ఈ ఎత్తుగడలు ఆ పార్టీని నష్టపరిచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Tdp chief Chandrababu naidu will meet TTDP leaders on Nov 2 at Hyderabad.There is a chance to Sandra Venkataveeraiah will elect as TDLP leader. Chandrababunaidu may announce Sandra name on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X