వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్ ఫోన్ కొంటే రూ.1000, 100 ఎంబీ డేటా ఫ్రీ, రూ.50వేలు దాటితే పన్ను: మోడీకి బాబు సూచనలు

నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, డిజిటల్ పేమెంట్స్ పైన అధ్యయనం చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు బృందం మధ్యంతర నివేదికను ప్రధాని మోడీకి సమర్పించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, డిజిటల్ పేమెంట్స్ పైన అధ్యయనం చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు బృందం మధ్యంతర నివేదికను ప్రధాని మోడీకి సమర్పించింది.

అనుమతి లేదు: అందుకే.. విశాఖలో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్!అనుమతి లేదు: అందుకే.. విశాఖలో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్!

ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ బృందం సౌత్ బ్లాక్‌లో మోడీని కలిసి నివేదికను సమర్పించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిశివరాజ్ సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ అరవింద్ పనగరియా తదితరులు మోడీని కలిశారు.

ఈ కమిటీ ప్రధానికి పదకొండు పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి 20 సూచనలు చేసింది. డిసెంబర్‌ నాటికి 3వేల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు జరిగేలా చూడాలని కమిటీ సూచించింది.

chandrababu naidu

ఏం చెప్పిందంటే...

నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూనే నగదురహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను మధ్యంతర ఉత్తర్వులో ప్రస్తావించారు. నగదురహిత సమాజ నిర్మాణాన్ని ఒక్కసారిగా చేపట్టడటం సాధ్యమయ్యే విషయం కాకపోయినా క్రమక్రమంగా ఆ దిశగా అడుగులు వేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

నాకు చెప్పొద్దు!: ముగ్గురికి దిమ్మతిరిగేలా చంద్రబాబు సమాధానంనాకు చెప్పొద్దు!: ముగ్గురికి దిమ్మతిరిగేలా చంద్రబాబు సమాధానం

నగదు రహిత లావాదేవీలు జరిపే వారికి భారీగా ప్రోత్సాహకాలు అందించాలని నివేదికలో సూచించారని తెలుస్తోంది. నోట్ల రద్దు వల్ల పేద, మధ్య తరగతివారికి ప్రయోజనాలు చేకూరే చర్యలను బడ్జెట్‌లో కూడా ప్రస్తావించాలని నివేదికలో పేర్కొంది.

గృహ రుణాల వడ్డీరేటు తగ్గించడం, ఆదాయ పరిమితిని పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించిందని తెలుస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి ప్రతి ఒక్కరికీ నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా ఇవ్వాలని కమిటీ సూచించింది.

ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానం తీసుకురావాలని, అన్ని బ్యాంకుల్లో మార్చి 31 నాటికి ఆధార్‌ను తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. అన్ని బ్యాంకుల లావాదేవీలను పర్యవేక్షించేలా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలంది.

రూ.50 వేలకు నగదు ఉపసంహరించుకుంటే..

బ్యాంకులనుంచి రూ.50వేలకు మించి నగదు తీసుకుంటే క్యాష్‌హ్యాండ్లింగ్‌ ఛార్జీ విధించాలని ప్యానెల్ సూచించింది. డిజిటల్‌ లావాదేవీలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న అన్నిరకాల మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేటులు రద్దు చేసి, ఇకమీదట అన్ని లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించాలని, నగదు చెల్లింపులకంటే డిజిటల్‌ చెల్లింపులు లాభదాయకంగా ఉండేలా ప్రోత్సహించాలని కోరింది.

ఐటీ పరిధిలోకి రానివారికి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు రూ.వెయ్యి, బయోమెట్రిక్‌ కొనుగోలుకు రూ.వెయ్యి రాయితీ ఇవ్వాలని చెప్పింది. డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులపై పాత తేదీలతో పన్నులు వేయవద్దని సూచించింది.

సంవత్సర ఆదాయంలో ఎవరైనా కొంత భాగాన్ని డిజిటల్‌ రూపంలో ఖర్చు చేసే వినియోగదారులకు ఆ మేరకు పన్ను వెనక్కు ఇవ్వాలని సూచించింది.

మెట్రో నగరాల్లోని బస్సులు, సబర్బన్‌ రైళ్లలో కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులను ప్రోత్సహించాలని సూచించింది.

ఆస్తులు, వాహనాలు, విలాసవంత వస్తువుల కొనుగోలు లాంటి భారీ లావాదేవీల్లో గరిష్ఠ నగదు వినియోగంపై పరిమితులు విధించాలని చెప్పింది. డిజిటల్ చెల్లింపులు ఉచితం చేయాలని సూచించింది.

English summary
Chandrababu Naidu panel submits interim report on digital payments to PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X