వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో మాట్లాడుతా, అమెరికాలో మార్పులొచ్చాయా: శ్రీనివాస్ భార్య సునయనతో బాబు

తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య అనంతరం అమెరికాలోని తెలుగు వారు అభద్రతాభావంతో గడుపుతున్నారని, వారికి అండగా నిలిచి మానసిక స్థైర్యాన్ని ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉందని ఏపీ సీఎ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య అనంతరం అమెరికాలోని తెలుగు వారు అభద్రతాభావంతో గడుపుతున్నారని, వారికి అండగా నిలిచి మానసిక స్థైర్యాన్ని ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

అమెరికాలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ప్రధానమంత్రితో మాట్లాడుతానని, అమెరికా సానుకూలంగా స్పందించి, అక్కడ హత్యలు ఆగేంత వరకు కేంద్రం ఒత్తిడి తీసుకు రావాలన్నారు.

<strong>'భారత్‌పై పాజిటివ్‌గా అమెరికా యంత్రాంగం', కన్సాస్ కాల్పులపై...</strong>'భారత్‌పై పాజిటివ్‌గా అమెరికా యంత్రాంగం', కన్సాస్ కాల్పులపై...

అమెరికాలోని కాన్సాస్ గత నెల 24న జరిగిన జాత్యాహంకార దాడిలో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను చంద్రబాబు శనివారం పరామర్శించారు. హైదరాబాద్ బౌరంపేటలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి, అరగంటకు పైగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో గడిపారు.

మోడీతో మాట్లాడుతా

మోడీతో మాట్లాడుతా

అమెరికాలోని భారతీయులందరికీ కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తామని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కూచిభొట్ల శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోవడంతో బౌరంపేటలో నివాసం ఉంటున్న ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించి అనంతరం మాట్లాడారు.

సునయ నుంచి ఆరా

సునయ నుంచి ఆరా

శ్రీనివాస్‌ భార్య సునయన, తల్లిదండ్రులు మధుసూదన్‌, వర్ధినిలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికైన తర్వాత భారతీయుల పట్ల విద్వేషాలు, దాడులు పెరిగాయా, పనిచేసే కార్యాలయాల్లో మార్పులేమైనా చోటుచేసుకున్నాయా అని సునయనను ఆరా తీశారు.

తండ్రి ఆవేదన

తండ్రి ఆవేదన

ఇలాంటివి ఉన్నట్లు శ్రీనివాస్‌ తనకెప్పుడూ చెప్పలేదని ఆమె చంద్రబాబుతో చెప్పారు. శ్రీనివాస్‌ తండ్రి మధుసూదన్‌ మాట్లాడుతూ.. పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకొనే సమయంలో ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రెచ్చగొట్టే నాయకులతో ఇలాగే..

రెచ్చగొట్టే నాయకులతో ఇలాగే..

కులమతాలు, జాతి విద్వేషాలను రెచ్చగొట్టే నాయకులతో ఇలాంటివి జరుగుతాయని చంద్రబాబు వారితో అన్నారు. శ్రీనివాస్‌ హత్యతో అమెరికాలోని భారతీయులందరూ అభద్రత, ఆందోళనకు గురవుతున్నారన్నారు.

పునరావృతం కావొద్దు

పునరావృతం కావొద్దు

ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా చూస్తానని అమెరికా స్పష్టం చేసేవరకు అందరూ సమష్టిగా పని చేయాలని చంద్రబాబు అన్నారు. అమెరికాలో ఉన్న అవకాశాలు మనదేశంలోనూ కల్పించాలన్నారు.

అపాయింటుమెంట్ ఇప్పిస్తా

అపాయింటుమెంట్ ఇప్పిస్తా

తమకు జరిగిన అన్యాయం మరోకుటుంబానికి జరగకుండా చూడాలని శ్రీనివాస్‌ కుటుంబం కోరిందని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి మోడీతో శ్రీనివాస్‌ కుటుంబసభ్యులకు అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామన్నారు.

శివశంకర్ కుటుంబ సభ్యులకూ పరామర్శ

శివశంకర్ కుటుంబ సభ్యులకూ పరామర్శ

కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్‌ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి శివశంకర్‌ కుటుంబసభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించారు.

English summary
AP Chief Minister N. Chandrababu Naidu on Saturday said that he would speak to Prime Minister Narendra Modi and the external affairs ministry regarding the safety of Indians in the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X