వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఉంటే తగ్గండి!: అధిష్టానానికి నో చెప్పిన బిజెపి, లోకేష్ చక్రం తిప్పేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం-బిజెపి మధ్య స్నేహపూర్వక పోటీ (ఫ్రెండ్లీ పోటీ) ఆ పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. స్నేహపూర్వక పోటీ బెడిసి కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. పది స్థానాల్లో ఇరు పార్టీలు పోటీ చేస్తున్నాయి. దానిని స్నేహపూర్వక పోటీ అంటున్నారు.

ఈ డివిజన్లలో టిడిపి, బిజెపిలు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. దీనిని స్థానిక లేదా డివిజన్ నాయకులు, పోటీలో నిలబడిన వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సోమవారం సత్యం థియేటర్ వద్ద టిడిపి తరఫున ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డిని బిజెపి నేతలు అడ్డుకున్నారు.

స్నేహపూర్వక పోటీ అయినప్పుడు మీరు వచ్చి ప్రచారం చేస్తే ఎలాగని, మీరు టిడిపికి ప్రచారం చేయవద్దని చెప్పారు. దీంతో టిడిపి, బిజెపిల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. తాజాగా మరో కొత్త ప్రతిపాదన బిజెపి నేతలను ఇబ్బంది పెడుతోంది.

Chandrababu to campaign in Hyderabad on 28 and 29

స్నేహపూర్వక పోటీ ఇబ్బందులు తీసుకు వస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీలు దీనిపై పునరాలోచిస్తున్నాయి. ఇది బిజెపి అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో, టిడిపి నేతలు బరిలో ఉన్నచోట బిజెపి నేతలను ఉపసంహరించాలని అధిష్టానం తెలంగాణ బిజెపి నేతలను ఆదేశించింది.

అందుకు తెలంగాణ బిజెపి నేతలు ససేమీరా అన్నారు. ఇప్పటికే ప్రచారం చేసుకున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. దీంతో అధిష్టానంకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. అసలు టిడిపితో పొత్తు ఇష్టమే లేని తెలంగాణ బిజెపి నేతలు.. బరిలో నుంచి తప్పించేందుకు మాత్రం అంగీకరించడం లేదు.

నారా లోకేష్ చర్చలు

టిడిపి నేతలు పోటీ చేసే చోట బరిలో ఉన్న బిజెపి నేతలను తప్పించే విషయమై టిడిపి యువనేత నారా లోకేష్ స్థానిక టిడిపి నేతలతో చర్చిస్తున్నారు. బిజెపిని తప్పించే అంశంపై చర్చిస్తున్న లోకేష్.. అవసరమైతే దీనిని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని పార్టీ నేతలకు చెప్పారు.

28, 29న చంద్రబాబు ప్రచారం

టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రెండురోజుల పాటు హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 29, 29తేదీల్లో నగరంలోని పలు డివిజన్లలో రోడ్‌షోలు, సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. పటాన్ చెరు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్ పేటలలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.

చంద్రబాబు టూర్,
గ్రేటర్ లో తనలోపప్గ టిడిపి బెజిప ఫ్రెంట్లీ పోటీ
బిజెపి అధిష్టానం, ప్రచారంలో ఉన్నందున పోటీ నుంచి తప్పుకోలేమని తేల్చి చెప్పారు, బిజెపి చంద్రబాబు దృష్టికీ తీసుకు వెళ్తానని లోకేష్, బిజెపిని తప్పించే అంశంపై లోకేష్ చర్చలు,

నన్ను గెలిపిస్తారు: విజయా రెడ్డి

ఖైరతాబాద్ అంటే పిజెఆర్ అని, పిజెఆర్ అంటే ఖైరతాబాద్ అని తెరాస అభ్యర్థి విజయా రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ నుంచి పిజెఆర్ కుటుంబ సభ్యులు ఒక్కరైనా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తప్పకుండా తనను ప్రజలు ఆదరిస్తారని, గెలుపు తనదే అన్నారు.

రోజుకో మాట మార్చిన తెరాస: లోకేష్

తెరాస రోజుకో మాట మారుస్తోందని టిడిపి నేత నారా లోకేష్ మండిపడ్డారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది టీడీపీయే అన్నారు. తెరాస రోజుకో మాట మార్చే మార్టీ అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కెసిఆర్ మాట తప్పారన్నారు. తెరాసలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. టిడిపి కూటమిని గెలిపిస్తే నీటి సమస్యే లేకుండా చేస్తామన్నారు. లోకేష్ మల్కాజిగిరి ప్రాంతంలో ప్రచారం చేశారు.

English summary
Telugudesam chief Chandrababu to campaign in Hyderabad on 28 and 29.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X