వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు వ‌ర్సెస్ తెలంగాణ..! టీ ఎన్నిక‌ల్లో బాబు ఎందుకు టార్టెట్ అవుతున్నారు..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : అదికార గులాబీ పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావుతో పాటు మంత్రి హ‌రీష్ రావు, మంత్రి కేటీఆర్, ఎంపీ క‌విత కూడా చంద్ర‌బాబును తెలంగాణ ద్రోహిగా చిత్రీక‌రిస్తూ ప్ర‌చార ప‌ర్వానికి శ్రీ‌కారం చుడుతున్నారు. చంద్ర‌బాబు తెలంగాణ అతిధి మాత్ర‌మే అని చెప్పిన కేసీఆర్ కుటుంబం ఎన్నిక‌లొచ్చే స‌రికి మ‌ళ్లీ చంద్ర‌బాబును దూషించి ప‌బ్బం గ‌డుపుకోవాల్సిన దిక్కుమాలిని ప‌రిస్థితులు ఎందుకు దాపురించాయి. ? తెలంగాణ‌ను వ‌దిలిపెట్టి నాలుగున్న‌రేళ్లుగా అమ‌రావ‌తికే ప‌రిమిత‌మైన చంద్ర‌బాబును తెలంగాణ విల‌న్ గా చూపిస్తే తెలంగాణ ప్ర‌జానికం విశ్వ‌స్తిస్తుందా..? కేసీఆర్ తో పాటు హ‌రీష్, కేటీఆర్ బాబు పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఇక్క‌డే ఉంటున్న సీమాంద్ర ప్ర‌జానికం ఆమోదిస్తుందా..? అస‌లు ముంద‌స్తు ఎన్నిక‌ల వ‌ర‌కూ చంద్ర‌బాబుకు తెలంగాణ‌కు సంబందంలేద‌ని చెప్పుకొచ్చిన అదికార పార్టీ నేత‌లు ఎన్నిక‌లు ప్ర‌క‌టించ‌గానే చేసిని అభివ్రుద్దిని ఏక‌రువు పెట్ట‌కుడా ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రిని నిందించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని తెలంగాణ ప్ర‌జానికం ప్ర‌శ్నిస్తోంది.

మ‌ళ్లీ చంద్ర‌బాబే విల‌న్..! అదికార గులాబీ పార్టీ నేత‌ల అనూహ్య ప్ర‌చారం..!!

మ‌ళ్లీ చంద్ర‌బాబే విల‌న్..! అదికార గులాబీ పార్టీ నేత‌ల అనూహ్య ప్ర‌చారం..!!

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వెళుతున్న టీఆర్ఎస్ అగ్రనేతలు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పై దూష‌ణ‌ల ప‌ర్వానికి తెర‌తీయ‌డం తెలిసిందే..! బాబును విల‌న్ గా చిత్రీక‌రించ‌డం వ‌ల‌న సీమాంద్రుల నుండి వ్యతిరేకత వస్తుందనే అంశాన్ని అదికార పార్టీ బేఖాత‌రు చేస్తోంది. తెలంగాణలో అడుగు పెడితే మా వద్దనున్న రికార్డులు బయటపెట్టి బాబు బండారం బయటపెడతాం' అని హరీష్ రావు చంద్రబాబును హెచ్చరించడంతో పాటు ప్రజలు కేసీఆర్‌ను నమ్ముతారా? లేక నక్క జిత్తుల చంద్రబాబును నమ్ముతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు గుంట నక్క అంటూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున చంద్ర‌బాబు తెలంగ‌ణ నుండి పారిపోయాడ‌ని ప‌లు సంద‌ర్బాల్లో చెప్పుకొచ్చిన గులాబీ నేత‌లు ఇప్పుడు తెలంగాణ ప్ర‌జానికాన్ని ప్ర‌భావితం చేస్తార‌ని బాబు పై అబాండాలు మోప‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

భావోద్వాగాల‌కు తావుందా..? బాబును టార్గెట్ చేస్తే టీఆర్ఎస్ కు ఓట్లు ప‌డ‌తాయా..?

భావోద్వాగాల‌కు తావుందా..? బాబును టార్గెట్ చేస్తే టీఆర్ఎస్ కు ఓట్లు ప‌డ‌తాయా..?

ఇక టీఆర్ఎస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు ఇదే అదనుగా బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతల టార్గెట్ చంద్రబాబునాయుడు అనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మొదలుకొని, కింది స్థాయి నేతల వరకూ అందరూ బాబుపై ఎదురుదాడి చేస్తున్నార‌ని తెలుస్తోంది. కాగా సీఎం కేసీఆర్, చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ భావోద్వేగాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలోని సెటిలర్లతోపాటు ఇతరుల్లో కూడా వ్యతిరేకత వస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినా టీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం. ఓ ప‌క్క బాబును విమ‌ర్శిస్తూనే మ‌రో ప‌క్క తెలంగాణ‌లో సెటిల్ ఐన క్ష‌త్రియులు, బ్రాహ్మ‌ణ త‌దిత‌ర సంఘాల‌తో కేటీఆర్ మంత‌నాలు జ‌ర‌వ‌ప‌డం కొస‌మెరుపు.

ఓట్లు అడ‌గ‌డానికి బాబు త‌ప్ప మ‌రో కార‌ణం లేదా..? నాలుగున్న‌రేళ్లుగా గులాబీ నేత‌లు సాదించింది ఏంటి..?

ఓట్లు అడ‌గ‌డానికి బాబు త‌ప్ప మ‌రో కార‌ణం లేదా..? నాలుగున్న‌రేళ్లుగా గులాబీ నేత‌లు సాదించింది ఏంటి..?

మరోవైపు అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అర శాతం, ఒక్క శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని, ఆ పార్టీని అసలు పరిగణ‌లోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించారు. అలాగే ప్రస్తుతం టీఆర్ఎస్ తమ ప్రత్యర్థి చంద్రబాబునాయుడే అన్నంతగా వ్యవహరిస్తోందన్నవ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం మహాకూటమి ఏర్పడిన తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంగానే అసహనంతోనే టీఆర్ఎస్ నేతలు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా బాబు రాజకీయ వ్యూహాలన్నీ ఢిల్లీని టార్గెట్ చేస్తుండ‌గా., అవి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనున్నాయన్న సందేహాలు అదికార పార్టీని తొలుస్తున్నాయి. అందుకే బాబును తెలంగాణ‌లో నిలువ‌రించ‌డం ప్ర‌ధాన ఎజెండాగా అదికార పార్టీ వావులు క‌దుపుతోంది.

జాతీయ స్థాయిలో బీజేపికి వ్య‌తిరేకంగా బాబు మంత‌నాలు..! టీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం..!

జాతీయ స్థాయిలో బీజేపికి వ్య‌తిరేకంగా బాబు మంత‌నాలు..! టీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం..!

అంతే కాకుండా చంద్రబాబు తెలంగాణలో పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారని, దాన్ని తిప్పికొట్టేందుకే టీఆర్ఎస్ నేతలు అలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమిలో ఉన్న చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి విజయానికే ప్రయత్నిస్తారనేది తెలిసిందే. అందుకే అసహనంతో టీఆర్ఎస్ నేతలు అలా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది.. ఏదిఏమైనా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ‌లు చేసినా, బాబును విల‌న్ గా చిత్రీక‌రించినా తెలంగాణ‌లో ఎంత‌వ‌ర‌కు వ‌ర్కౌట్ అవుతుంద‌నేది ప్ర‌శ్న‌గా మారుతోంది. అంతే కాకుండా తెలంగాణ సెంట్ మెంట్ కు సంబందించిన భావోద్వేగాల‌ను చంద్ర‌బాబుకు ఆపాదిస్తూ ప్ర‌చారం చేయ‌డం ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌న‌మ‌నేది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారుతోంది. విప‌రీత మైన విమ‌ర్శ‌ల ప‌రంప‌ర కూడా బూమ్రాంగ్ అవుతుంద‌నే అంశాన్ని అదికార గులాబీ పార్టీ గ్రహించాల‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

English summary
trs party throwing Target to Chandrababu in the early elections. Apart from Chief Minister Chandrasekhar Rao, Minister Harish Rao, Minister KTR and MP Kavitha also portray Chandrababu as a Telangana traitor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X