కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు .. అన్నా అంటూ స్పందించిన సీతక్క !!
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్కకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు సీతక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆమెకు తన విషెస్ తెలిపారు. తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క కు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
జోష్
లో
సీతక్క
...
టీపీసీసీ
చీఫ్
రేవంత్
రెడ్డిని
కలిసేందుకు
100
భారీ
కార్ల
భారీ
కాన్వాయ్!!
తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే @seethakkaMLA గారికి జన్మదిన శుభాకాంక్షలు. గిరిజనుల, ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే మీ సేవాగుణం స్ఫూర్తిదాయకం. ప్రజలే సర్వస్వంగా భావించే మీరు నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను pic.twitter.com/voZ1scEGFq
— N Chandrababu Naidu (@ncbn) July 9, 2021
గిరిజనుల ,ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే మీ సేవాగుణం స్ఫూర్తిదాయకం అంటూ చంద్రబాబు సీతక్కకు కితాబిచ్చారు. అంతేకాదు ప్రజలే సర్వస్వంగా భావించే సీతక్క నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క తన స్పందన తెలియజేశారు. థాంక్యూ అన్న అంటూ సీతక్క చంద్రబాబుకు తన కృతజ్ఞతలు తెలియజేశారు.

గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన సీతక్క రేవంత్ రెడ్డి తో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నేటికీ అనేక సందర్భాల్లో సీతక్క చంద్రబాబుతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు సీతక్క. ఇక ఇటీవల సీతక్క తల్లి ఆసుపత్రిలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్లి ఆమె తల్లి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి పార్టీ మారిన టిడిపి అధినేత పట్ల అభిమానాన్ని సీతక్క, సీతక్క పట్ల ఆప్యాయతను చంద్రబాబు కనబరుస్తూ ఉండడం విశేషం. రాజకీయాల్లో ఇటువంటి ఔన్నత్యం ఉండటం నిజంగా అవసరం అని వీరిద్దరి బంధం స్పష్టం చేస్తుంది.
Thank you so much @ncbn anna 🙏 https://t.co/G3QGn97R1N
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) July 9, 2021