వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయచేసి ఆ ప్రచారం వద్దు, భరతం పడతాం: డ్రగ్ రాకెట్‌పై హెచ్చరిక

డ్రగ్స్ కేసులో ఒకే వర్గాన్ని టార్గెట్ చేస్తున్నామనే ప్రచారం సరికాదని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ సోమవారం చెప్పారు.దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఒకే వర్గాన్ని (టాలీవుడ్ ఇండస్ట్రీని) టార్గెట్ చేస్తున్నామనే ప్రచారం సరికాదని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ సోమవారం చెప్పారు. దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు.

పేర్లు చెప్పేది లేదు: చార్మీ సహా అందరికీ అకున్ గట్టి జవాబుపేర్లు చెప్పేది లేదు: చార్మీ సహా అందరికీ అకున్ గట్టి జవాబు

డ్రగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల వారినీ ఒకేలా పరిగణిస్తున్నామని చెప్పారు. సినీ పరిశ్రమకు సంబంధించి 12మందికి నోటీసులు ఇచ్చామనీ, ఇప్పటివరకు ఐదుగురిని ప్రశ్నించామన్నారు.

Chandravadan warns drug racket gang

దర్యాప్తు కొనసాగుతోందని, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తామన్నారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసి డ్రగ్స్‌ మాఫియా భరతం పడతామన్నారు. ఈ కేసు విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ కేసును అప్పగించిందని చెప్పారు. ఇతర శాఖల అధికారులు ఈ కేసు విచారణలో సహకరిస్తున్నారన్నారు. తమకు లీగల్‌ సపోర్టు టీం కూడా ఉందన్నారు.

కెల్విన్ అమాయకుడు: సిట్‌కు లాయర్ సవాల్!, '1960 నుంచి వాడకమని..'కెల్విన్ అమాయకుడు: సిట్‌కు లాయర్ సవాల్!, '1960 నుంచి వాడకమని..'

న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామన్నారు. ఆరు బృందాల్లో సమర్థత , అనుభవం కలిగిన అధికారులు ఉన్నారని చెప్పారు. చట్టానికి లోబడి, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నమూనాలు సేకరిస్తామన్నారు.

దర్యాప్తు చేస్తున్న అధికారులు అంతా సమర్థులే అన్నారు. నిందితుల నుంచి 3 వేల యూనిటల్ ఎల్ఎస్‌డి, కొకైన్ 45 గ్రాములు, 6 గ్రాముల మస్రూమ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 2వ తేదీ వరకు డ్రగ్ కేసు విచారణ కొనసాగుతుందన్నారు.

English summary
IAS officer Chandravadan on Monday warned drug raket gang. He said that excise department is not targetting film industry in drug racket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X