వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు? ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమా

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారం 2019లో మార్చి 16నుంచి ఏప్రిల్ 2 వరకూ తెలంగాణలో.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇబ్బంది తలెత్తే అవకాశం వుందని పరీక్ష తెదేల్లో మార్పు చేస్తే బాగుంటుంది అనే భావన ఉపాధ్యాయ సంఘాల నుండి వ్యక్తమవుతుంది.

తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్ష తేదీలో మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మార్చి 22న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉన్నందున ఆరోజు పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదు. దీంతో ఆరోజు పదోతరగతి ఇంగ్లీష్ పేపర్-2 పరీక్ష తేదీలో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Change in tenth class exam date..? The MLC election is the reason

ఎన్నికల తేదీ మారే అవకాశం లేదు కాబట్టి పరీక్ష తేదీనే మార్చాల్సి ఉంటుందని ఆర్‌టీయూ తెలంగాణ నాయకులు అంజిరెడ్డి, చెన్నయ్య ఎన్నికల నేపధ్యంలో తమకు తలెత్తిన ఇబ్బంది దృష్ట్యా అధికారులను కోరారు. పాఠశాల విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్‌కు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తమ వినతి పత్రాన్ని ఇచ్చి పరీక్షా తేదీ మార్చాలని విజ్ఞప్తి చేశారు . దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నట్టు విజయ్‌కుమార్‌ తెలిపారు.

English summary
Telangana state is likely to change in the tenth class public examination date. Teachers unions want to change the tenth class English Paper 2 exam date to be held on March 22 due to the MLC's election in Telangana. The main reason is that teachers have to participate in the MLC election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X