ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమత హత్యకేసు : బతికుంటే డేంజర్... అందుకే హత్య...!

|
Google Oneindia TeluguNews

సాధారణంగా చేసిన తప్పును సరిదిద్దుకోకుండా... దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరోతప్పును చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు...ఈ ధోరణి పలు హత్యానేరాల్లో పాల్గోన్న నిందితుల మనసుల్లో నుండి వెలువడుతున్న సంకేతాలు... నేరాన్ని చేయడం అందుకు సాక్ష్యాలు లేకుండా తాయారు చేయడం అనే కోణంలో ఏకంగా మనుష్యులనే మట్టుబెడుతున్నారు. ఇందుకు తార్కాణం ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన వివాహిత సమతాపై జరిగిన అత్యాచారం, హత్యగా పోలీసులు చెబుతున్నారు.

 దిశకు ముందు మరో మహిళ అత్యాచారానికి బలి

దిశకు ముందు మరో మహిళ అత్యాచారానికి బలి

హైదరాబాద్‌లో దిశ సంఘటన జరిగిన రెండు రోజుల ముందే కొమురం భీమ్ జిల్లాలో సమతా అనే వివాహిత మహిళపై బలవంతంగా అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. దీంతో దిశ సంఘటనతో పాటు సమత సంఘటన కూడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం, మీడియా ఆమె హత్యపై నజర్ పెట్టాయి. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పదిహేను రోజుల్లోనే నిందితులపై కోర్టుకు చార్జీషీటును దాఖలు చేశారు.

కోర్టులో చార్జీషీటు

కోర్టులో చార్జీషీటు

పోలీసులు ఇచ్చిన అభియోగ పత్రంలో పలు అంశాలు వెలుగు చూశాయి. ఇందులో సంఘటన జరిగిన తీరుతోపాటు నిందితుల వాంగ్మూలాన్ని పొందుపరిచారు. ముఖ్యంగా సమతపై అత్యాచారం చేసిన నేపథ్యంలో ఆమె ప్రతి ఘటించింది. అయినా.. దుండగులు ఆమెను బలాత్కారం చేశారు. కాగా ముగ్గురు నిందితుల్లో షేక్ బాబు అనే నిందితుడు ఆమెపై ముందుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇందుకోసం మిగిలిన ఇద్దరు ఆమె కదలకుండా కాళ్లు, చేతులు పట్టుకుని సహకరించారు. అనంతరం మిగతా ఇద్దరు సైతం ఆమెపై అత్యాచారనికి పాల్పడ్డారు.

 బతికి ఉంటే ప్రమాదమని హత్య

బతికి ఉంటే ప్రమాదమని హత్య

అయితే ఇక్కడవరకు మద్యం మత్తులో ఉండి అత్యాచారం చేసిన నిందితులకు అప్పుడే భయం చుట్టుకుంది. తాము చేసింది పెద్ద నేరంగా అత్యాచారం జరిగిన తర్వాత తెలుసుకున్నారు. జరిగిన అత్యాచారాన్ని ఆమె ఖచ్చితంగా బయట చెబుతుందనే భయంతో ముగ్గురు ఆలోచనలో పడ్డారు. దీంతో ఆమెను హతమార్చడమే ద్వారనే బయటపడగలమనే అలోచనకు వచ్చారు. వెంటనే షేక్ షాబుద్దిన్, షేక్ మక్ధుమ్‌లు బాధితురాలిని గట్టిగా పట్టుకోగా.. షేక్‌బాబు అనే నిందితుడు తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను పోడిచాడు. చివరకు ఆమె గొంతుకోసి చంపివేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

20 రొజుల్లోనే విచారణ పూర్తి

20 రొజుల్లోనే విచారణ పూర్తి

కాగా మొత్తం కేసుపై పోలీసులు 40 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు. దీంతోపాటు 96 పేజీలు నివేదికను తయారు చేశారు. కేసుకు సంబంధించిన సాంకేతికపరమైన సాక్ష్యాలను పోందుపరిచారు. నిందితులు వాడిన కత్తితోపాటు, వారు వేసుకున్న బట్టలు, బాధితురాలి వద్ద తీసుకున్న రెండు రూపాయలను సైతం కోర్టుకు సమర్పించారు. కాగా ఈ కేసును ఫాస్ట్ కోర్టు విచారిస్తోంది. మొత్తం సాక్ష్యాలు సరిపోతే.. నిందితులకు కేవలం నెల రోజుల్లోనే శిక్షలు ఖారారు అయ్యో అవకాశాలు ఉన్నాయి.

English summary
charge sheet have been filed of samata rape and murder case in the court . total 96-page report was submitted to the court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X