హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెల్విన్ ఎలా పరిచయం: చార్మికి సిట్ ప్రశ్నల వర్షం?

టాలీవుడ్ సినీ నటి చార్మిని సిట్ అధికారులు ఆరుగంటలపాటు విచారించారు. ఆమె విచారణ సమయంలో ప్రధానంగా కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీసినట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదగంటలకంటే ముందుగానే విచారణను.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటి చార్మిని సిట్ అధికారులు ఆరుగంటలపాటు విచారించారు. ఆమె విచారణ సమయంలో ప్రధానంగా కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీసినట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదగంటలకంటే ముందుగానే విచారణను ముగించారు అధికారులు.

డ్రగ్స్ కేసు విషయమై సిట్ అధికారులు చార్మిని ఆరుగంటలపాటు విచారణ సాగించారు. బుదవారం నాడు ఉదయం పదిగంటల సమయంలో చార్మి ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొంది.

ఈ కేసు విషయమై చార్మి రెండురోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఛార్మి విచారణ సాగింది. సాయంత్రం ఐదుగంటలలోపుగానే విచారణ సాగించాలని కోర్టు ఆదేశాలను జారీచేసింది. ఈ ఆదేశాలను పాటించారు సిట్ అధికారులు పాటించారు.

పురుషులు మాత్రం ఈ విచారణలో పాల్గొనలేదు. అయితే ఈ కేసు విషయమై అవసరమైతే మరోసారి కూడ చార్మిని విచారించే అవకాశాలు కూడ లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కెల్విన్‌తో సంబంధాలపైనే ప్రశ్నలు

కెల్విన్‌తో సంబంధాలపైనే ప్రశ్నలు

సినీ నటి ఛార్మికి డ్రగ్స్ మాఫియాలో కీలక వ్యక్తి కెల్విన్‌తో సంబంధాలపై ప్రశ్నలు కురిపించినట్టు సమాచారం. నలుగురు మహిళా అధికారులు చార్మిని విచారించారు. ఆమె విచారణ సందర్భంగా సిట్ అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తలను తీసుకొన్నారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండ్ అనిత, సీఐలు విజయలక్ష్మీ, శ్రీలత, రేణుక బృందం విచారణ చేసింది.కెల్విన్ ఎలా పరిచయమయ్యారు. ఎంతకాలం నుండి ఆయనతో సంబంధాలున్నాయి. ఫోన్‌లో చార్మిదాదా అని కెల్విన్ సేవ్ చేసుకొన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించారు. అంతేకాదు చాటింగ్ పై కూడ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.

వీకెండ్‌లో పబ్‌లకు వెళ్తారా?

వీకెండ్‌లో పబ్‌లకు వెళ్తారా?

వీకెండ్‌లో పబ్‌లకు వెళ్తారా అనే విషయాలపై కూడ సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారని సమాచారం. కెల్విన్‌తో జరిగిన వాట్పాప్ సమాచారం గురించి అడిగారు. వాహెద్, ఖుద్దూస్‌లతో ఉన్న పరిచయంపై ప్రశ్నించారని సమాచారం. కెల్విన్ వద్ద ఉన్న చార్మి నెంబర్ తదితర అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించారని సమాచారం.

సాఫ్ట్‌వేర్ కంపెనీలు లిస్ట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు

సాఫ్ట్‌వేర్ కంపెనీలు లిస్ట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు

బుదవారం నాడు కమింగ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇతను ప్రధానంగా నగరంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు డ్రగ్స్‌ను సరఫరాచేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా సిట్ అధికారులు తెలంగాణ ఐటీ శాఖకు సమాచారాన్ని ఇచ్చారు. నగరంలోని ఏ ఐటీ కంపెనీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే లిస్ట్‌ను అందించారు. ఈ లిస్ట్ ఆధారంగా ఆయా కంపెనీల ప్రతినిధులతో జయేష్ రంజన్ చర్చిస్తున్నారు.

నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే

నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే

డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఆయా కంపెనీలను కోరారు.ఈ మేరకు ఆయా కంపెనీలతో చర్చించినట్టు ఆయన ప్రకటించారు. నగరంలోని 400 ఐటీ కంపెనీల్లో సుమారు 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే అందరూ కూడ డ్రగ్స్ తీసుకొంటున్నారని చెప్పలేమంటున్నారు అధికారులు. డ్రగ్స్ ఎవరు తీసుకొంటున్నారనే పేర్లను మాత్రం వెల్లడించలేదని ఐటీ శాఖ కార్యదర్శి ప్రకటించారు.

శాంపిళ్ళు ఇచ్చేందుకు నిరాకరించిన ఛార్మి

శాంపిళ్ళు ఇచ్చేందుకు నిరాకరించిన ఛార్మి


ఛార్మి తన వెంట్రుకలు, గోళ్ళు, రక్తం శాంపిళ్ళను ఇచ్చేందుకు నిరాకరించిందని సిట్ అధికారులు తెలిపారు.విచారణ అనంతరం ఆమె నవ్వుతూ సిట్ కార్యాలయం నుండి వెళ్ళిపోయారు. సిట్ కార్యాలయంలోని లిప్ట్‌లో వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుతూ లిప్ట్ నుండి బయటకు వచ్చారు. ఆమె కుటుంబ నేపథ్యంతో సినిమాల్లోకి ఎలా వచ్చారని ప్రశ్నిస్తూ డ్రగ్స్ కేసుపై ఆమెను ప్రశ్నించారని తెలిసింది.

English summary
SIT officers interrogated Tollywood actress Charmi on Wednesday. Four women SIT officers interrogated her six hours. Excise officials implemented high court directions for charmi interrogation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X