హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చార్మిని విచారిస్తున్న సిట్: కెల్విన్‌ కాల్‌డేటాలో ‘చార్మిదాదా’గా, చాటింగే కీలకం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న సినీ నటి చార్మి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. బౌన్సర్ల భద్రత మధ్య ఆమె సిట్ కార్యాలయానికి వచ్చారు. బుధవారం ఉదయం 10గంటల నుంచి చార్మిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం ఉదయం కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న చార్మి.. అక్కడ్నుంచే నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చారు చార్మి.

కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో చార్మిని మహిళా అధికారులే విచారిస్తున్నారు. అసిస్టెంట్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత విచారణలో పాల్గొన్నారు. అంతేగాక, ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సిట్ విచారించనుంది.

కొంత నిరాశే, కానీ: చార్మి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇలాకొంత నిరాశే, కానీ: చార్మి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇలా

charmi kaur went to SIT Office

హైకోర్టు ఇచ్చిన సమయంలో పూర్తి కాకుంటే రేపు(గురువారం) రోసారి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కెల్విన్ కాల్ డేటాలో చార్మి పేరు ఉండటం, డ్రగ్స్ వ్యవహారంలో పూరీతో ఉన్న సంబంధాలపైనే సిట్ అధికారులు ఎక్కువగా విచారించనున్నట్లు తెలుస్తోంది.

సత్యహరిశ్చంద్రులా?: చార్మి పిటిషన్‌పై ఆమె, ఎక్సైజ్ తరపు లాయర్ల పోటాపోటీ వాదనలుసత్యహరిశ్చంద్రులా?: చార్మి పిటిషన్‌పై ఆమె, ఎక్సైజ్ తరపు లాయర్ల పోటాపోటీ వాదనలు

కెల్విన్‌తో వాట్సప్ సంభాషణలపైనా సిట్ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కాగా, డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో చార్మి 1000కిపై సంభాషణలు జరిపినట్లు తెలిసింది. అంతేగాక, కెల్విన్ ఫోన్ డేటాలో చార్మిని చార్మి దాదాగా ఫీడ్ చేసుకున్నట్లు సమాచారం.

కాగా, పూరీ దర్శకత్వంలో చార్మి నటించిన జ్యోతిలక్ష్మీ ఆడియో వేడుకకు కూడా కెల్విన్ పాల్గొనడం గమనార్హం. అంతేగాక, అతడితో చార్మి సెల్ఫీలు దిగడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో చార్మి ఏం చెబుతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, మంగళవారం రాత్రి నుంచి చార్మి ఇంట్లో లేదని, సిట్ విచారణ ఎలా ఎదుర్కొవాలన్న వ్యూహంపై సన్నిహితులు, నిపుణులతో చర్చించినట్లు సమాచారం.

English summary
Actress Charmy Kaur went to SIT Office on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X