వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాశే కొంపముంచింది. ఎన్ ఆర్ ఐ లను లక్ష్యంగా డబ్బులు వసూలు చేసి ఎంజాయి చేశాడు

రెండు మూడు మాసాల్లోనే పెట్టిన పెట్టుబడికి 30 నుండి 35 శాతం డబ్బులను ఇస్తామని ఎన్ ఆర్ ఐ లను మోసం చేసిన డబ్బులను వసూలు చేసిన నిందితుడు కోర్టులో లొంగిపోయాడు. ఎన్ ఆర్ ఐ లనుండి వసూలు చేసిన డబ్బులతో ఆయన విద

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలను ఇస్తామని ప్రచారం చేసి కోట్లాది రూపాయాలను వసూలు చేసి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొన్న నిందితుడిని పోలీసులు కోర్టులో హజరుపరిచారు. ఎన్ ఆర్ ఐ లనుండి వసూలు చేసిన డబ్బులతో ఎంజాయి చేశాడు. వారికి చెల్లించేందుకు డబ్బులు లేక తప్పించుకొని తిరిగాడు. డబ్బులు చెల్లించిన వారి ఒత్తడి పెరగడంతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైద్రాబాద్ లోని మాసబ్ ట్యాంకుకు చెందిన షేక్ ఇర్షాద్ మహామ్మద్ వృత్తిరీత్యా వ్యాపారి. తన స్నేహితుడు రవి కిరణ్ తో కలిసి 2013 లో గ్జింట్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ పేరుతో యూసుఫ్ గూడలో కార్యాలయాన్ని ప్రారంభించాడు. స్వంతంగా ఆర్బిట్ సొల్యూష్యన్స్ సంస్థను కూడ ఆయన ప్రారంభించాడు.ఈ సంస్థకు ఇర్షాద్ తన సతీమణి హిమబిందు శివంగిని మేనేజింగ్ డైరెక్టర్ ను చేశాడు.

cheater arrest surrender in hyderabad court

తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు ఇస్తాం

తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఎన్ ఆర్ ఐలను నమ్మించి ఆయన మోసం చేశాడు. ఈ సంస్థ ప్రారంభించిన కొత్తలో ఆయన కొందరికి రెండు మాసాల కాలంలో 20 శాతానికి పైగా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ డబ్బులను ఇచ్చాడు.అంతర్జాతీయ సంస్థల్లో పలు కంపెనీల్లో తనకు పరిచయాలు ఉన్నాయని ఆయన విదేశీయులను నమ్మించాడు. ఈయన మాటలను నమ్మిన ఎన్ ఆర్ ఐలు కొందరు గ్జింట్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ లో 8.05 కోట్లు పెట్టుబడులు పెట్టారు. రెండు మాసాలకు 230 నుండి 35 శాతం పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని నమ్మించాడు.తొలుత రెండు మాసాలు బాగాలనే ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి నమ్మకంగా డబ్బులు ఇచ్చాడు.

తొలుత రెండు మాసాలు సక్రమంగా డబ్బులు ఇవ్వడంతో ఆయన ను నమ్మిన చాలా మంది ఎన్ ఆర్ ఐ లు ఈ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెట్టారు.2013 నుండి 2016 వరకు డబ్బులు వసూలు చేశాడు.ఈ డబ్బులను బోగస్ కంపెనీల్లోకి మళ్ళించాడు.ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బులు ఇవ్వకుండా చేతులెత్తేశాడు. ఈ ఏడాదిలో నిందితుడిపై బాధితులు ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే జూన్ లోనే నిందితుడు అస్ట్రేలియాకు పారిపోయాడు.

అస్ట్రేలియాలో కూడ ఈయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారి బంధువులు ఉన్నారు.దీంతో అక్కడ కూడ ఉండలేని పరిస్థితులు ఆయన ఇండియాకు తిరిగి వచ్చాడు. డిసెంబర్ 5వ, తేదిన కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో సిసిఎస్ పోలీసులు ఆయననను విచారించారు. ఎన్ ఆర్ ఐ లనుండి వసూలు చేసిన డబ్బులతో విదేశాలకు వెళ్ళివస్తూ ఎంజాయి చేసినట్టు నిందితుడు చెప్పాడు.

English summary
shaik irshad native of hyderabad, he started gjit management company in yousufguda. who invest in this company , they get 30 to 35 percent increase amount to invest amount.he target nris, he gathered around 8.05 crores from nri. two months he gave 30 percent amount to nris, he nisuse this amount, after three months he didnot give money to nris, he went to australia this year june, victims complient against him on octber this year. he came back to india recently. on dec 5 he surrender to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X