వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుడు సమాచామిచ్చి యువతిని పెళ్ళిచేసుకొన్నాడు, ఆ పై ఏం చేశాడంటే

తప్పుడు ఫ్రోఫైల్ తో అమెరికాలో ఉద్యోగం చేస్తోన్న యువతిని వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు వివాహం చేసుకొన్నాడు. వివాహం తర్వాత ఆ యువతి అమెరికా వెళ్ళిపోయింది. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధప

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఒక్క పెళ్ళి చేయాలంటే వంద అబద్దాలైనా ఆడాలని పెద్దలు చెబుతుంటారు. ఆనాడు పెద్దలు ఎందకు ఈ మాట చెప్పారో కాని, ఓ వక్తి తప్పుడు సమాచారంతో అమెరికాలో పనిచేస్తోన్న యువతిని వివాహం ఆడాడు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా యువతి నుండి తీసుకొన్నాడు. మళ్ళీ మళ్ళీ అదే కారణాలతో యువతి నుండి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించడంతో అసలు విషయం బట్టబయలైంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

వరంగల్ జిల్లా కు చెందిన పరాంకుశం ప్రశాంత్ హైద్రాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. తన తెలివితేటలతో ఎదుటి వ్యక్తును బురిడీ కొట్టించడంలో దిట్ట తప్పుడు సమాచారంతో మ్యారేజీ బ్యూరోకు ప్రకటనలు ఇచ్చి అమెరికాలో పనిచేస్తోన్న యువతిని వివాహం చేసుకొన్నాడు ప్రశాతం.ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ప్రోగ్రాం మేనేజర్ గా పనిచేసిన అనుభవంతో స్వంతంగా సాఫ్ట్ వేర్ సంస్థను ఏర్పాటు చేసుకొన్నట్టు ప్రశాంత్ ప్రోఫైల్ సృష్టించాడు.

బ్యాంకుల్లో లక్షలు డిపాజిట్ చేసినట్టు నమ్మించాడు. సినిమాలు నిర్మించే పనిలో తిరుగుతున్నానని చెప్పుకొన్నాడు. ఈ ప్రోఫైల్ ఆధారంగా మ్యారేజ్ బ్యూర్ కు పంపాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నగరానికి చెందిన యువతి ఈ ఏడాది ఫిబ్రవరిలో నగారినికి వచ్చింది. ఈ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ఆధారంగా యువతి కుటుంబసభ్యులు ప్రశాంత్ ను సంప్రదించారు. రెండు కుటుంబాలు ఇద్దరి వివాహానికి అంగీకరించారు.

 cheater arrested by police in hyderabad

తప్పుడు ప్రోఫైల్ ఆధారంగా వివాహనికి అంగీకరించారు. అయితే వివాహ సమయంలో ఖర్చు కోసం కూడ యువతినే సంప్రదించాడు. సినిమా నిర్మాణం కోసం బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బులను పెళ్ళి కోసం తీయడం ఎందుకంటూ నాలుగు లక్షలను యువతి నుండి తీసుకొన్నాడు నిందితుడు.యువతి ఇచ్చిన డబ్బులతోనే బంగారం, నగలు, దుస్తులు కొనుగోలు చేశాడు ప్రశాంత్.

మియాపూర్ లోని ఓ హోటల్ లో వివాహం చేసుకొన్నారు. వివాహమైన కొన్నాళ్ళకు ఆ యువతి అమెరికా వెళ్ళిపోయింది. అయితే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరానని చికిత్స కోసం సుమారు 25 లక్షల వరకు ఖర్చు అవుతోందని ఆయన అమెరికాలో ఉన్న తన భార్యకు సమాచారం పంపాడు. ఈ సమాచారం పై అనుమానం వచ్చిన ఆమె హైద్రాబాద్ లోని తన కుటుంబసభ్యులకు సమాచారాన్ని పంపింది. బాధితురాలి కుటుంబసభ్యులు ఆరాతీయగా ప్రశాంత్ మోసం చేశాడని తేలిపోయింది. ఇదే తరహలో మరో యువతిని పెళ్ళిచేసుకొనేందుకు ప్రశాంత్ ప్రయత్నిస్తున్నట్టు తేలింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు . నిందితుడిని అరెస్టు చేశారు.

English summary
prashanth from warangal district . but he is living in hyderabad srinagar colony. he create wrong profile for marrage , young lady working in america somedays, that lady family members approach for marrage, prashanth married that lady. after that she went america, prashant asked for her 25 lakhs,for his treatment, she get doubt about him, her family members enquired about him, then they will get information he is cheated me. thew complient against prashant.police arrest prashanth,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X