వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత మోసమా?: సినిమాల్లో అవకాశం అంటూ.. బలవంతంగా 10 అశ్లీల చిత్రాల్లో..

సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని మోసగించి, బలవంతంగా ఆమెను అశ్లీల చిత్రాల్లో నటింపజేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని మోసగించి, బలవంతంగా ఆమెను అశ్లీల చిత్రాల్లో నటింపజేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే... 24 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాఫ్ట్ నర్సుగా పనిచేస్తుంది. ఆమె తమ్ముడి ద్వారా లోక్‌నాథ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ లోక్‌నాథ్ ఆ యువతిని తన తల్లి విజయలక్ష్మి వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశాడు.

ఈ క్రమంలో ఆమెకు ఓ సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం కల్పించడమే కాకుండా, మూడువేల రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు. దీంతో ఆ నర్సుకు వారిపై నమ్మకం పెరిగింది.

Cheating: A Private Nurse was forcebly acted in 10 Porn Short Films

ఈ క్రమంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకూ ఆ నర్స్ అంగీకరించింది. ఆ యువతితో ఓ తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్న విజయలక్ష్మి, యూనిట్ సభ్యులతో ఆమెను షూటింగ్‌కు పంపింది. ఆపై గుర్తు తెలియని ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లి వారు అసభ్యంగా ప్రవర్తించారు.

బాధితురాలు వెంటనే విజయలక్ష్మికి ఫోన్ చేసి విషయం వివరించగా.. 'వాళ్లు ఎలా చెబితే అలా చెయ్.. లేకుంటే వేరే కేసులో ఇరికిస్తా..' అంటూ విజయలక్ష్మి బెదిరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో యూనిట్ సభ్యులు చిత్రీకరించిన పది అశ్లీల షార్ట్ ఫిల్మ్స్‌లో ఆ యువతి నటించాల్సి వచ్చింది.

దర్శకుడు దుర్గారావు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని బయటికి చెప్పుకుంటే తన పరువు పోతుందనే భయంతో పాపం ఆ నర్సు తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుంది.

ఆమెతో వారు చిత్రీకరించిన ఆ షార్ట్ ఫిల్మ్స్ ఇటీవల ఆన్ లైన్‌లో పెట్టడంతో ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A private hospital nurse was cheated by a movie unit here in Moinabad of Rangareddy District. According to her complaint to police.. Previously she was given a small role in a film. After that Vijayalakshmi made a contract with her and sent her to the shooting location along with the unit team. There she was forcebily acting in porn short films. Recently the films were uploaded online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X