వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేషన్ అక్రమాలకు చెక్ ..అక్రమార్కుల భరతం పట్టేందుకు వాట్సాప్.. టీ రేషన్ యాప్

|
Google Oneindia TeluguNews

రేషన్ అక్రమాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపైన కంట్రోల్ రూమ్ ఫిర్యాదులు చేసేందుకు వాట్సాప్ నెంబర్ ను ఏర్పాటు చేశారు .అంతేకాకుండా రేషన్ షాపుల్లో సరుకుల వివరాలు, రేషన్ షాప్ లొకేషన్ తెలుసుకోవడం కోసం టి రేషన్ యాప్ ను రూపొందించారు పౌరసరఫరాల శాఖ అధికారులు.

Check for ration irregularities ..Civil supplies intiation whatsapp ,T ration app

రేషన్ బియ్యం పెద్ద ఎత్తున దొడ్డి దారి పడుతున్న నేపథ్యంలో అక్రమాలు చోటు చేసుకుంటే ఫోటోలను ,వీడియో క్లిప్పింగులను, ఆడియోలను పంపి కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేసేందుకు 7330774444 వాట్సాప్ నెంబర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. అంతేకాకుండా ఎవరైనా రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే , పౌరసరఫరాల శాఖ అధికారులు అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.

మహిళలకే మమత అగ్రతాంబులం .. 41 శాతం టికెట్లు కేటాయించిన దీదీ మహిళలకే మమత అగ్రతాంబులం .. 41 శాతం టికెట్లు కేటాయించిన దీదీ

దీని వల్ల రాష్ట్రంలోని రెండు కోట్ల 80 లక్షల మంది నిరుపేద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు తీసుకునే సదుపాయం కలగనుంది. ఇక ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, తాజాగా రేషన్ అక్రమార్కులకు చెక్ పెట్టడానికి , రేషన్ బియ్యం దండ జరగకుండా ఉండడానికి తీసుకొనే చర్యల్లో భాగంగా వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే అధికారులు ఏ మాత్రం స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
The Telangana government decided to check the ration irregularities . The T-ration app will be available as part of it. The control room has been set up to receive complaints against ration offenders. Also, 7330774444 Watsapp Number was set up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X