నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో .. చెడ్డీ గ్యాంగ్ : ఇందూరులో బీభత్సం.. మంగళసూత్రం చోరీ

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ : చెడ్డీ గ్యాంగ్ .. ఈ పేరు వింటే హైదరాబాద్, శివారు ప్రాంతాల వాసులు హడలెత్తిపోతారు. గతంలో వీరు చేసిన బీభత్సాన్ని తలచుకొని ఒక్కసారిగా వణికిపోతారు. చాలారోజులకు మళ్లీ చెడ్డీ గ్యాంగ్ పేరు వినిపించింది. ఎప్పుడూ సిటీపై నజర్ చేసే గ్యాంగ్ .. ఈసారి నిజామాబాద్‌లో అలజడి సృష్టించడంతో .. గజగజ వణికిపోతున్నారు జనం.

చెడ్డీ గ్యాంగ్ బీభత్సం ..
అర్ధరాత్రి దాటింది .. మరికొద్ది గంటల్లో తెల్లవారబోతోంది. అంతే నిజామాబాద్‌లోని ముబారక్ నగర్‌లో అలజడి. కొందరొచ్చి డోర్ తీయమని అరిచారు. ఎదో కొత్త స్వరం .. రాత్రి వేళ ఎవరు అని ఆలోచించేలోపే ... తలుపు తీయాలని బెదిరింపులు .. వచ్చింది చెడ్డీ గ్యాంగ్ అని నిర్ధారించుకొని భయాందోళనకు గురయ్యారు కుటుంబసభ్యులు. తలుపు తీయకపోవడంతో బీభత్సం సృష్టించారు. ఇంటి తలుపులు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. దాదాపు రెండుగంటలపాటు అరుపులు, పెడబొబ్బులతో లోపల ఉన్నవారికి బయటినుంచే నరకం చూపించారు. కిటికీ ధ్వంసం చేయడంతో ఇంట్లో ఉన్న ఒకరికి గాయాలయ్యాయి. ఇంతలో అక్కడికి స్థానికులు రావడంతో చెడ్డీ గ్యాంగ్ పారిపోయింది. లేదంటే ఇళ్లు మొత్తం గుళ్ల చేసి ఉండేది.

cheddi gang attack in nizamabad

మరో ఇంట్లో చోరీ ..
ఆ ఇంట్లో పని కాలేదని మరో ఇంట్లోకి చొరబడ్డారు. భార్యభర్తలను బెదిరించారు. మహిళకు విలువైన ఆభరణం పుస్తెలతాడు అని కూడా చూడలేదు. దానికి ఎత్తుకెళ్లారు. మిగతా వస్తువులను తీసుకొని పలాయనం చిత్తగించారు. మహిళ భర్తపై దాడిచేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు ఇళ్లలో అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఏం జరిగిందని అరవడంతో .. చెడ్డీగ్యాంగ్ అక్కడినుంచి పారిపోయింది. ఒకవేళ స్థానికులు రాకపోయి ఉంటే .. మరిన్ని ఇళ్లలో దోపిడి చేసే ఆస్కారం ఉండేది. కానీ రాత్రి జరిగిన ఘటనను గుర్తుచేసుకొని .. గజ గజ వణికిపోతున్నారు ముబారక నగర్ వాసులు. తమ కాలనీల్లో గస్తీని పోలీసులు మరింత పెంచాలని కోరుతున్నారు.

cheddi gang attack in nizamabad
English summary
Worried in Mubarak Nagar in Nizamabad. Someone shouted at the door. It was a new voice .. who was thinking of the night before ... threats to get out the door .. came to know that the cheddi gang and were panicked by the family members. The door was not blown up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X