చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షాలపై నెల ముందే హెచ్చరిక: బాధితులు చెన్నై టు హైదరాబాద్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడు రాజధాని చెన్నైలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అడయార్, వేళచ్చేరి, శ్రీనగర్‌, మేడిచ్చూర్‌, మేడంబాక్కం తదితర ప్రాంతాల్లో కొంతమేర వరద తగ్గుముఖం పట్టింది. నాలుగు రోజులుగా చెన్నైలోని సగం ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

రేపటి వరకు దక్షిణమధ్య రైల్వే అన్ని రైళ్లను రద్దు చేసింది. అరక్కోణం వైమానిక స్థావరం నుంచి ఎయిర్ ఇండియా విమాన సేవలు కొనసాగిస్తోంది. వరదల్లో చిక్కుకున్న 192 మంది పర్యాటకులను గురువారం సాయంత్రం మిలిటరీకి చెందిన సీ 17 విమానంలో హైదరాబాద్ తరలించారు.

బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు వారిని తరలించారు. వీరు అందరూ ముంబై, ఢిల్లీ, చండీగఢ్ తదితర ప్రాంతాలకు చెందిన వారు. వారిని ఆయా ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తమిళనాడులో సహాయక చర్యలు చేపట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు బేగంపేట నుంచి 300 మంది సైనికులు సీ 17 విమానంలో అరక్కోణం వెళ్లారు.

మరోవైపు, భారీ వర్షాలకు నెల రోజుల ముందే మెట్ (మెటరలాజికల్ డిపార్టుమెంట్) భారీ వర్షాలు వస్తాయని, వరదలు వస్తాయని హెచ్చరించింది. అక్టోబర్ నెల మధ్యలో హెచ్చరికలు జారీ చేసింది. 112 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడే అవకాశముందని ముందే సూచించింది.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

తమిళనాడు రాజధాని చెన్నై వర్షాలు, వరదలతో అతలాకుతలం అయింది. దీంతో చెన్నై విమానాశ్రయంలో చిక్కుకున్న వారిని హైదరాబాద్ తరలించిన దృశ్యం.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

తమిళనాడు రాజధాని చెన్నై వర్షాలు, వరదలతో అతలాకుతలం అయింది. దీంతో చెన్నై విమానాశ్రయంలో చిక్కుకున్న వారిని బేగంపేట తరలించిన దృశ్యం.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

కుండపోత వర్షాలు, వరదలతో సతమతమవుతున్న చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం వర్షాలు తెరిపివ్వడంతో సహాయ, పునరావాస చర్యలు ఊపందుకున్నాయి.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

పరిస్థితి తీవ్రతను స్వయంగా తెలుసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెన్నైకి చేరుకుని వరద ప్రాంతాలను ప్రత్యేక విమానంలో పరిశీలించారు.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

తీవ్రంగా నష్టపోయిన తమిళనాడుకు ప్రధాని నరేంద్ర మోడీ రూ.1000 కోట్ల తక్షణ సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి జయలలిత కూడా గురువారం వరదప్రాంతాలను హెలికాప్టర్‌లో వీక్షించారు.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

కడలూరు, విల్లుపురం, కన్యాకుమారి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కొనసాగాయి. మృతుల సంఖ్య 269కి చేరింది. చెన్నై నగరానికి ఇప్పటికీ బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పడలేదు.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

అనేక కాలనీలు ఏడు నుంచి 10 అడుగుల లోతునీటిలో చిక్కుకుని ఉన్నాయి. కాంచీపురం జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడటంతో చెన్నై-మధురై గ్రాండ్‌ సదరన్‌ ట్రంక్‌ రోడ్డు పూర్తిగా తెగిపోయింది.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

శనివారం వరకూ అన్నిరైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణరైల్వే ప్రకటించింది. రాజాలి నౌకాదళ వైమానిక స్థావరం నుంచి తాత్కాలికంగా విమానసేవలు అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులకు గిరాకీ గణనీయంగా పెరిగి ధరలు చుక్కలను అంటుతున్నాయి. పాలు, కిలో కూరగాయలు, వాటర్ బాటిళ్లు రూ.వంద వరకు అమ్ముతున్నారు.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాహనదారులు పెట్రోలు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఏటీఎంల వద్ద పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

దాదాపు ఎనభై శాతం ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. సెల్‌ఫోన్లు పని చేయడంలేదు. సహాయక చర్యల నిమిత్తం కేంద్రం మరిన్ని బలగాలను చెన్నైకి పంపింది.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నైలోనే 110 పడవలను ఉపయోగించి దాదాపు అయిదు వేల మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వరదనీటిలో చిక్కుకుపోయిన ఏడు నెలల గర్భిణి సహా 270 మందిని హెలికాప్టర్‌ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగర శివార్లలోని మాదంబాక్కంలో సుకన్య అనే గర్భిణిని వైమానిక అధికారులు, సైన్యం హెలికాప్టర్ ద్వారా తాంబరంలోని వైమానిక స్థావరం ఆసుపత్రికి తరలించారు.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ముంపులో చిక్కుకుపోయిన ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులను తాంబరం వైమానిక స్థావరానికి సురక్షితంగా తరలించారు.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఇళ్ల పైకప్పులపై చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నవారికి భారత వైమానిక దళం దాదాపు 14 లక్షల ఆహార పొట్లాలను అందించింది.

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చెన్నై అతలాకుతలం - సురక్షిత ప్రాంతాలకు తరలింపు

అడపాదడపా కురుస్తున్న జల్లులు, చేంబరంబాక్కం జలాశయం నుంచి విడుదలైన వరదనీరు కారణంగా కొత్తగా కోడంబాక్కం, అశోక్‌నగర్‌, టీ-నగర్‌ వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

English summary
Air India has come to the rescue of stranded travellers today saying it will operate a special flight to the Arrakonam Naval Air Station to ferry stranded passengers who have been airlifted from Chennai airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X