చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై వరదలు: చలించిన విశాల్ కంటతడి, తెలుగు ప్రాంతాల్లో వ్యాధులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/చెన్నై: సినీ నటులు విశాల్, సిద్ధార్థ‌లో చెన్నై వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శనివారం విశాల్ బాధితుల కష్టాలను చూసి చలించి, కంటతడి పెట్టారు.

అన్ని ప్రాంతాలు చక్కబడేంత వరకు షూటింగులను పక్కన బెట్టి సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. విశాల్ బృందంలో ఏకంగా 50 మందికి పైగా చేరి నగరవ్యాప్తంగా ఆహారపొట్లాలు, తాగునీరు, బ్రెడ్ ప్యాకెట్లు అందిస్తున్నారు. కాగా, విశాల్ తెలుగువాడైన విషయం తెలిసిందే.

విశాల్ ఐదు రోజులుగా బాధితుల సేవలో ఉన్నారు. బాధితులను ఆదుకునేందుకు ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి ఆ సభ్యులందరి ఇళ్లలోను వంటలు చేసి, వాటిని ఒక్కో ప్రాంతానికి వాహనాల్లో తీసుకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. విశాల్‌తో పాటు హీరో సిద్ధార్థ్ కూడా సహాయం చేస్తోన్న విషయం తెలిసిందే.

 Chennai Floods: Vishal helps people

తెలుగు ప్రాంతాల్లో వ్యాధుల భయం

చెన్నైలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరదకు తోడు వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇక్కడ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలుగు ప్రజలు నివాసం ఉంటే కొన్ని ప్రాంతాల్లో సహాయక సహకారాలు సక్రమంగా అందటం లేదని ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

మాధవరం, ఆర్కేనగర్ కాలనీలోని కొరుక్కుపేట తదితర ప్రాంతాల్లో తెలుగువారు వేలాది మంది ఉంటారు. కుళాయిల్లో కార్పోరేషన్ నీళ్లు రంగుమారి వస్తున్నాయి. గత్యంతరం లేక తాగుతున్నారు. పలు స్వచ్చంద సంస్థలు, తెలుగు సంఘాలు అందించే వితరణ పైన ప్రస్తుతం ఈ ప్రాంత వాసులు ఆశ్రయం పొందుతున్నారు.

English summary
Chennai Rain: Actors Vishal, Siddharth now Helping for Chennai People's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X