హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆటోమేటిక్ డోర్ లాక్ కారులో చిన్నారిని వదిలి టిఫిన్‌కెళ్లిన పేరెంట్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయ రహదారిలో కారు డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో ఓ చిన్నారి చిక్కుకుపోయింది. రెండేళ్ల ఆ చిన్నారిని తల్లిదండ్రులు కారులోనే వదిలి టిఫిన్ చేసేందుకు వెళ్లారు. పాప కారులోనే ఉంది.

వాళ్లు తిరిగి వచ్చారు. అప్పటికే డోర్లు లాకయ్యాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అక్కడకు చేరుకున్న స్థానికులు కారు అద్దాలను పగులగొట్టి చిన్నారిని రక్షించారు. దీంతో తల్లిదండ్రులు, అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.

Child stuck in automatic door lock car

కారు బీభత్సం

సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం సమీపంలో ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పుట్‌పాత్‌పై ఉన్న చెరకు బండి, టీ స్టాల్‌ను ఢీకొట్టింది. సంగీత్‌ చౌరస్తా నుంచి తార్నాక - ఉప్పల్‌ వైపు వెళ్తున్న హ్యుందాయ్‌ కారు అధిక వేగంతో అదుపుతప్పి, వాటిని ఢీకొట్టింది.

అనంతరం పక్కనే ఉన్న ప్రహరీ గోడను బలంగా ఢీకొని ఆగింది. ప్రమాదం సమయంలో జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా సీటు బెల్టు పెట్టుకున్నారు. దీంతో వారికి కూడా గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Child stuck in automatic door lock car in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X