హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ కేసులో మరో సంచలనం: లిస్టులో పోలీస్ అధికారుల పిల్లలు.. 20మందికి పైనే?

మూడు రోజుల క్రితమే ఈ విషయం బయటకు పొక్కగా.. డ్రగ్స్ తీసుకున్నవారి పేరెంట్స్ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో బుధవారం అరెస్టయిన మైక్ కమింగా నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ కమింగా.. నగరంలోని పలువురు పోలీసు ఉన్నతాధికారుల పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా చెబుతున్నారు.

పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్‌కు చార్మి కౌంటర్పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్‌కు చార్మి కౌంటర్

మూడు రోజుల క్రితమే ఈ విషయం బయటకు పొక్కగా.. డ్రగ్స్ తీసుకున్నవారి పేరెంట్స్ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. వారి పిల్లలను కౌన్సెలింగ్ కేంద్రాలకు తరలించినట్లు సమాచారం. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు, మరికొందరు ప్రధాన అధికారుల పిల్లలకు మైక్ డ్రగ్స్ అందించినట్లు గుర్తించిన సిట్.. వారందరికీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

children of police officials also involved in drugs case

ఇకనైనా పిల్లలను కనిపెట్టుకుని ఉండాలని వారికి సూచించినట్లు చెబుతున్నారు. మైక్ కమింగా కస్టమర్లుగా మొత్తం 20మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారని, వీరంతా కార్పోరేట్ కాలేజీలు, పాఠశాలల్లో చదువుతున్నట్లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే, ఇప్పటిదాకా డ్రగ్స్ కేసులో పట్టుబడిన విదేశీయులంతా ఎక్కువగా నైజీరియన్సే కాగా.. మైక్ కమింగ్స్ ఒక్కడే నెదర్లాండ్స్ కు చెందినవాడు కావడం గమనార్హం.

English summary
Mike Cummings was revealed to police regarding facts behind drugs supply. He said some of the Police officials children also involved in this
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X