వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారుల‌కు ఇష్ట‌మైన పండుగ బాల‌ల దినోత్స‌వం..! న‌వంబర్ 14 కోసం పిల్ల‌ల ఎదురుచూపు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : బాల్యం..! భగవంతుడు మనకిచ్చిన అమూల్యమైన వరం. అభం శుభం ఎరుగని అమాయకమైన పసిమొగ్గల లాంటి వారు బాల, బాలికలు. వారికి కల్లా కపటం తెలియదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం అంటే అసలే తెలియదు. అమ్మా నాన్నలు, స్నేహితులు తప్ప వారికి వేరే లోకం తెలియదు. వారికి కావాల్సిందల్లా ఆట, పాటలే. తెలిసిందల్లా గట్టిగా కేకలు వేయడం, బిగ్గరగా నవ్వడం మాత్రమే. బాల్యం ఎంత విలువైందో ఆ స్థాయి దాటిన వారినెవరిని అడిగినా చెబుతారు. చాలా మంది పెద్దయ్యాక బాల్య స్మృతులను నెమరువేసుకొని సంతోషించడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాల్యం ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతుంది.

జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజే బాల‌ల దినోత్స‌వం..! పిల్ల‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన రోజు..!!

జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజే బాల‌ల దినోత్స‌వం..! పిల్ల‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన రోజు..!!

ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ బాలల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ రకాల పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలల్లో ఉండే నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. నవంబర్‌ 14 భారతీయ బాలలకు ఎంతో ఇష్టమైన రోజు. ప్రభుత్వం అధికారికంగా వారికోసం కేటాయించిన ఒక్కగానొక్క రోజది.

 బాల్యం దేవుడిచ్చిన వరం..! నేడు బాలల దినోత్సవం..!!

బాల్యం దేవుడిచ్చిన వరం..! నేడు బాలల దినోత్సవం..!!

భారత దేశ ప్రప్రథమ ప్రధాన మంత్రి పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ చిన్నపిల్లలంటే విపరీతమైన ప్రేమానురాగాలను చూపెట్టేవారు. ఈ కారణంగానే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏటా నవంబరు 14వ తేదీన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజున బాల, బాలికల కోసం పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలకు రకరకాల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

 పిల్లలు ఉపాధ్యాయులుగా మారే అరుదైన వేడుక..! విద్యార్థుల‌కు ఇదో మ‌ధుర జ్ఞాప‌కం..!!

పిల్లలు ఉపాధ్యాయులుగా మారే అరుదైన వేడుక..! విద్యార్థుల‌కు ఇదో మ‌ధుర జ్ఞాప‌కం..!!

బాలల దినోత్సవం అంటే, అందరికీ గుర్తొచ్చేది పాఠశాలల్లో పిల్లలంతా సంబురంగా జరుపుకునే స్వయం పరిపాలనా దినోత్సవం. అంటే పిల్లలే తాత్కాలిక గురువులుగా మారి తమ సహచర విద్యార్థులకు పాఠాలు బోధించడం. ప్రతి ఏటా ఈ రోజు కోసం విద్యార్థులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. తమకు రోజూ పాఠాలు బోధించే ఉపాధ్యాయులను అనుసరించడం, వారిలా వేషధారణ చేయడం, తరగతులకు వెళ్లి పాఠాలు చెప్పటం.. వారికి చెప్పలేనంత మధురానుభూతిని కల్గిస్తుంది.

ఒక్కో దేశం లో ఓక్కో తారీఖున బాల‌ల దినోత్స‌వం..! పిల్లల జీవితంలో చెరిగిపోని అనుభూతి..!!

ఒక్కో దేశం లో ఓక్కో తారీఖున బాల‌ల దినోత్స‌వం..! పిల్లల జీవితంలో చెరిగిపోని అనుభూతి..!!

నవంబరు 14కు 2, 3రోజుల ముందు నుండే పిల్లలంతా ప్రిపరేషన్‌లో నిమగ్నమవుతారు. తమకు నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవడం, దానిలో ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని ఉపాధ్యాయుడి సహకారంతో ప్రిపేర్‌ అవుతుంటారు. ఆ రకంగా పాఠశాలల్లో టీచర్లుగా మారి పిల్లలు చేసే సందడి చూడడానికి రెండు కళ్లు చాలవు. అయితే బాలల దినోత్సవాన్ని మనలాగా ప్రపంచదేశాలన్నీ అదే రోజున జరుపుకోవు. ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్‌ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాకిస్తాన్ లో న‌వంబర్ 20, ద‌క్ష‌ణ కొరియా, జ‌పాన్ లో మే 5, పోలాండ్ లో జూన్ 1, శ్రీ‌లంక లో అక్టోబ‌ర్ 1న బాల‌ల దినోత్స‌వం జ‌రుపుకుంటారు.

English summary
Children's Day is celebrated on November 14 every year. This festival is celebrated on the occasion of Jawaharlal Nehru's birthday. On the Children's Day, special ceremonies are held at each school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X