హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిలుకానగర్ నరబలి: దృశ్యం సినిమానే, నోరు విప్పని రాజశేఖర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదు ఉప్పల్‌లోని చిలుకానగర్ నరబలి కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. నిందితుడు తాను నరబలి ఇచ్చినట్లు అంగీకరించాడని చెబుతున్నా సాక్ష్యాధారాలు సేకరించడంలో పోలీసులకు చిక్కులు ఎదరువుతున్నట్లు తెలుస్తోంది.

చిలుకానగర్ నరబలి: విస్తుపోయే విషయం, క్షుద్రపూజల్లో భార్య వీరంగం చిలుకానగర్ నరబలి: విస్తుపోయే విషయం, క్షుద్రపూజల్లో భార్య వీరంగం

దృశ్యం సినిమాలోని హీరో మాదిరిగా ప్రధాన నిందితుడు రాజశేఖర్ వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. రాజశేఖర్ చెబుతున్న విషయాల్లో ఏ మేరకు వాస్తవం ఉందనేది పోలీసులు నిర్ధారించుకోలేకపోతున్నారని అంటున్నారు.

దాన్ని నరబలిగానైతే తేల్చారు

దాన్ని నరబలిగానైతే తేల్చారు

చిలుకానగర్ చిన్నారి తల కేసును రాచకొండ పోలీసులు నరబలిగానైతే తేల్చారు. అయితే, ప్రధాన అనుమానితుడు రాజశేఖర్ మాత్రం వివరాలను చెప్పడం లేదని అంటున్నారు. పైగా, పోలీసులను తప్పు దోవ పట్టించే విధంగా విచారణలో పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు.

మూసీలో మొండాన్ని పడేశానని...

మూసీలో మొండాన్ని పడేశానని...

నరబలి ఇచ్చిన రాత్రే చిన్నారి మొండాన్ని మూసీనదిలో పడేశానని రాజశేఖర్ పోలీసు విచారణలో చెప్పాడు. అయితే, అందులో వాస్తవమెంత ఉందనేది పోలీసులు తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఎన్ని రీతుల్లో ప్రశ్నించినా రాజశేఖర్ అంతకు మించి చెప్పడం లేదని అంటున్నారు.

విచారించి వదిలేసిన తర్వాత

విచారించి వదిలేసిన తర్వాత

విచారణ కోసం తీసుకుని వచ్చి వదిలేసిన తర్వాత రాజశేఖర్ తన సన్నిహితులతో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తును తప్పుదారి పట్టించే విధంగా సమాధానాలు ఇచ్చానని రాజజశేఖర్ వారితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించరు. అందుకు సంబంధించిన కాల్ రికార్డులను పోలీసులు సేకరించారు.

గతంలో కూడా అతను..

గతంలో కూడా అతను..

రాజశేఖర్ గతంలో కూడా ఇటువంటి పూజలు చేసినట్లు తెలుస్తోంది. అతడి ఇంట్లో గుర్తించిన రక్తం మరకలు డిఎన్ఎ ప్రొఫైలింగ్ చిన్నారి మెడకు ఉన్న రక్తం మరకలతో సరిపోలడంతో అతనే నేరం చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ ఇతర ఆధారాలు ఏవీ పోలీసులకు చిక్కడం లేదు.

ఈ విషయాలు తేలడం లేదు

ఈ విషయాలు తేలడం లేదు

చిన్నారిని అపహరించిన ప్రాంతం గురించి గానీ, మొండెం పడేసినట్లుగా చెబుతున్న మూసీ నది పరిసర ప్రాంతాల్లోగానీ రాజశేఖర్ సంచరించినట్లుగా బలమైన ఆధారాలను పోలీసులు సేకరించలేకపోయినట్లు తెలుస్తోంది. అతడి వాంగ్మూలంలో నిజమెంత అనేది తేల్చుకోలేకపోతున్నారు.

అలా అయితనే బలంగా...

అలా అయితనే బలంగా...

చిన్నారి తల్లిదండ్రులను గుర్తించడంతో పాటు మొండెం, బలి ఇవ్వడానికి వాడిన ఆయుధం దొరికితేనే కేసులో సాక్ష్యాలు బలంగా ఉంటాయని అంటున్నారు. ఈ సమాచారం కోసం ఎంతగా ప్రశ్నించినా రాజశేఖర్ నోరు విప్పడం లేదని అంటున్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Rachakonda Police are not able to collect perfect evidences in Chiluakanagar human sacrifice case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X