వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు శాంతి అవసరం లేదు.. ట్రంప్ చైనాతో తెరవెనుక ఏం చేస్తున్నారో చెప్పిన కేఏ పాల్

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాను ముందే చెప్పానని, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. బోర్డర్ లో చైనా భారత సైన్యాన్ని మట్టుబెట్టి వ్యవహరించిన తీరుపై స్పందించిన ఆయన చైనాకు బుద్ధిచెప్పే నేత లేకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

India China Border Issue: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మలు దహనం ... చైనాపై నిరసనల హోరుIndia China Border Issue: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మలు దహనం ... చైనాపై నిరసనల హోరు

వూహాన్ ల్యాబ్ నుండి కరోనాను బయటకు పంపింది చైనానే

వూహాన్ ల్యాబ్ నుండి కరోనాను బయటకు పంపింది చైనానే

ఇక చైనా గురించి తను ఫిబ్రవరిలోనే చెప్పానని, కరోనా వైరస్ ను వూహాన్ ల్యాబ్ నుండి బయటకు చైనానే పంపించిందని,ఇక ఈ విషయం ముందుగా చెప్పింది తానేనని కెఏ పాల్ పేర్కొన్నారు. మార్చి లో ప్రపంచ దేశాలన్నింటికీ ఇక ఈ విషయాన్ని తాను లేఖలు రాశారని,వీడియో సందేశాల ద్వారా పంపానని ఆయన చెప్పుకున్నారు.లక్షలాదిమంది తాను చెప్పిన విషయానికి మద్దతు తెలిపారని కెఏ పాల్ పేర్కొన్నారు. చైనాకు దీటైన నాయకుడు ప్రపంచంలో లేకపోవడమే చైనీయులు ఇంతగా రెచ్చిపోవడానికి కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

చైనాకు శాంతి అవసరం లేదు .. యుద్ధమే ముఖ్యం

చైనాకు శాంతి అవసరం లేదు .. యుద్ధమే ముఖ్యం

ఇక అంతే కాదు భారత సైనికులు 20 మంది చనిపోయారు అంటే అసలు కారణం ఏంటి అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. చైనాకు శాంతి అవసరం లేదని,యుద్ధమే ముఖ్యమని, చైనా విషయంలో అమెరికా కూడా ఏమీ చేయలేకపోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో తెరవెనుక వ్యాపారాలు చేస్తున్నాడని కేఏ పాల్ ఆరోపించారు. ఇక అలాగే రష్యా మద్దతు కూడా తీసుకుంటున్నారు అంటూ పాల్ పేర్కొన్నారు. అందుకే తాను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు సపోర్ట్ చెయ్యటం లేదన్నారు .

 గల్లీ ఫైట్స్ ఆపి దేశం కోసం పోరాడాలి

గల్లీ ఫైట్స్ ఆపి దేశం కోసం పోరాడాలి

ఇక తాను 27 సార్లు చైనా వెళ్ళిన దాన్ని బట్టి ఇక మన దేశాన్ని రక్షించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ కష్టపడుతున్నారని, వారితో కలిసి దేశాభివృద్ధి కోసం మనమంతా పని చేద్దామని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ , మమతా బెనర్జీ , స్టాలిన్ వంటి అందరు నేతలను కలిపి దేశాన్ని కాపాడుకోవాలని కే ఏ పాల్ పిలుపునిచ్చారు. ఇక దేశంలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు, భౌద్దువులు, జైనులు, సిక్కులు అందరిని కలిపిద్దామని తాను అనేక మీటింగ్‌లలో చెప్పానన్నారు. తాను ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదని , గల్లీ ఫైట్స్ మాని రాజకీయాలకు అతీతంగా దేశం కోసం చైనాతో పోరాడాలని ఆయన కోరారు.

English summary
KA Paul questioned the real reason why 20 Indian soldiers were killed. KA Paul made interesting comments that China does not need peace, war is important and that the US cannot do anything about China. KA Paul has accused US President Trump of doing backstage deals with China. Paul added that Russia is also supporting trump. That is why he does not support US President Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X