హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో డ్రైపోర్టు, ప్రీఫ్యాబ్ పరిశ్రమలు: చైనా ప్రతినిధులతో కెసిఆర్ భేటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ.. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇటీవల తన బీజింగ్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చైనాకు చెందిన అగ్రశ్రేణి నిర్మాణరంగ సంస్థ శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు రావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు.

శానీ గ్రూప్ నాయకత్వంలో వచ్చిన చైనా కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య శుక్రవారం రెండు కీలక ఒప్పందాలు కుదిరాయి.

రాష్ట్రంలో డ్రైపోర్ట్ నెలకొల్పడానికి, అలాగే ప్రిఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపించడానికి చైనాకు చెందిన అగ్రశ్రేణి సంస్థ సాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానంపై చైనా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఆ తర్వాత డ్రైపోర్ట్ స్థాపనపై సాని గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వెన్‌జెన్, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. అలాగే గృహ నిర్మాణాలకు ఉపయోగించే ప్రిఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సంబంధించిన ఒప్పంద పత్రాలను సాని ఇంటర్నేషనల్ హౌజింగ్ జనరల్ మేనేజర్ హైజున్ డెంగ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దానకిషోర్ మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

తెలంగాణ.. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్


ఇటీవల తన బీజింగ్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చైనాకు చెందిన అగ్రశ్రేణి నిర్మాణరంగ సంస్థ శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు రావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

శానీ గ్రూప్ నాయకత్వంలో వచ్చిన చైనా కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్



ఈ సందర్భంగా చైనా కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య శుక్రవారం రెండు కీలక ఒప్పందాలు కుదిరాయి.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

రాష్ట్రంలో డ్రైపోర్ట్ నెలకొల్పడానికి, అలాగే ప్రిఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపించడానికి చైనాకు చెందిన అగ్రశ్రేణి సంస్థ సాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానంపై చైనా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

ఆ తర్వాత డ్రైపోర్ట్ స్థాపనపై సాని గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వెన్‌జెన్, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

అలాగే గృహ నిర్మాణాలకు ఉపయోగించే ప్రిఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సంబంధించిన ఒప్పంద పత్రాలను సాని ఇంటర్నేషనల్ హౌజింగ్ జనరల్ మేనేజర్ హైజున్ డెంగ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దానకిషోర్ మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం దేశ విదేశాల్లో అత్యుత్తమైందిగా ప్రశంసలు అందుకుందన్నారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తోన్న ప్రోత్సహకాలు, రాయితీలను ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమల స్థాపనకు నిరంతర విద్యుత్ సరఫరా, కావాల్సినంత ల్యాడ్ బ్యాంక్, పారిశ్రామిక అవసరాలకు సరిపడినంత నీరు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన కంపెనీలకు కేవలం రెండువారాల్లో సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులను ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

చైనా ప్రతినిధులతో కెసిఆర్

చైనా ప్రతినిధులతో కెసిఆర్

పరిశ్రమల స్థాపనకు సకాలంలో అనుమతులను పొందడాన్ని హక్కుగా కల్పిస్తూ చట్టం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలతోపాటు అత్యుత్తమైన పారిశ్రామిక విధానం ఉందన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం దేశ విదేశాల్లో అత్యుత్తమైందిగా ప్రశంసలు అందుకుందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తోన్న ప్రోత్సహకాలు, రాయితీలను ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమల స్థాపనకు నిరంతర విద్యుత్ సరఫరా, కావాల్సినంత ల్యాడ్ బ్యాంక్, పారిశ్రామిక అవసరాలకు సరిపడినంత నీరు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన కంపెనీలకు కేవలం రెండువారాల్లో సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులను ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. పరిశ్రమల స్థాపనకు సకాలంలో అనుమతులను పొందడాన్ని హక్కుగా కల్పిస్తూ చట్టం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలతోపాటు అత్యుత్తమైన పారిశ్రామిక విధానం ఉందన్నారు.

అవినీతిరహిత పాలనను అందిస్తున్నామని, పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సిఎం కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చేజింగ్ సెల్ పనితీరును కెసిఆర్ వివరించారు. అధికారుల బృందంతో కలిసి తాను ఇటీవల చైనా పర్యటనకు వచ్చిన సందర్భంగా తమపట్ల చూపిన ఆదరణకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చైనా పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన విందుకు సిఎంతోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, కె తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

English summary
Two MoUs have been signed between the visiting Chinese companies led by Sany Group and Telangana Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X