సోనూసూద్ బాటలో చిరంజీవి.!ఆక్సీజన్ బ్యాంకుల ఏర్పాటుకు మెగా కార్యాచరణ.!
హైదరాబాద్ : కరోనా విపత్కర సమయంలో ఎంతో మంది బాదితులకు తనవంతు సాయం అందిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు బాలీవుడ్ కథానాయకుడు సోనూసూద్. ప్రాంతాలకతీతంగా, మతాలకతీతంగా, భాషలకతీతంగా ఆపదలో ఉన్నవారందరికి తానున్నానంటూ, తనను సంప్రదిస్తే తోచిన సాయం చేస్తానంటున్నాడు హీరో సోనూసూద్. కరోనా బాదితుల పట్ల స్పందించి, సాయం చేస్తున్న ఏకైక నటుడుగా దేశంలో ముద్రవేసుకున్నారు సోనూసూద్. ఇప్పుడు ఇదే సోనూసూద్ తెలుగు హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రజా సేవలో చిరంజీవి.. కోవిడ్ బాదితులకోసం మెగాస్టార్ బృహత్కర కార్యక్రమం..
కరోనా మొదటి దశలో ఎంతో కొంత సహాయం చేసిన సోనూసూద్, రెండవ దశలో మాత్రం ఆక్సజన్ సిలిండర్లను సైతం కరోనా బాదితులకు అందుబాటులోకి తీసుకొచ్చి కొన్ని వందల ప్రాణాలను కాపాడుతున్నారు సోనూసూద్. సోనూసూద్ కార్యక్రమాల గురించి దేశం మొత్తం చర్చ జరుగుతున్న సందర్బంలో మెగాస్టార్ చిరంజీవి సైతం కరోనా బాదితుల పట్ల స్పందిస్తున్నారు. అందుకోసం ఓ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసారు మెగాస్టార్ చిరంజీవి.

ఆక్సీజన్ కొరత ఉండకూడదు.. అందుబాటులకి మెగా ఆక్సీజన్ బ్యాంకులు..
రెండవ దశ కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. సకాలంలో ఆక్సీజన్ అందక అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇటీవల తిరుపతిలో కూడా ఇదే సమస్య కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. జిల్లాల స్థాయుల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా కార్యకలాపాలు మొదలయ్యేలా కార్యచరణ రూపొందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

కరోనా బాదితులకు కోసం తనవంతు సాయం.. వినూత్న కార్యక్రమానికి మెగాస్టార్ రూపకల్పన..
ఇందుకు సంబందించిన పనులు కూడా ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. రక్తం దొరకని పరిస్థితిలో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో 1998లో ఆయన బ్లడ్ బ్యాంకును స్థాపించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు. అందరికీ వారం రోజుల్లోగా ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా తగినంత ఆక్సీజన్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

వారం రోజుల్లోనే అందుబాటులోకి తేవాలి.. వేగంగా ఆక్సీజన్ బ్యాంక్ పనులు..
కోరోనా బాదితుల కోసం ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించేందుకు చిరంజీవి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న కరోనా పేషెంట్లను రక్షించాలనే ధృఢసంకల్పంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. కరోనా బాదితుల కోసం తన వంతు సాయం చేసి వారికి అండగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ఈ కార్యక్రమానికి రూకల్పన చేసినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే వారం రోజుల్లో ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభించే దిశగా కార్యాచరణ ఉంటుందని మెగా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.