• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మెగాస్టార్ మెగా మనసు..! సీసీసీ సరుకులను ఆ విధంగా చెక్ చేసి ఔరా అనిపించుకుంటున్న చిరంజీవి..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి : కరోనా క్లిష్ట సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. సాటి కళారుల పట్ల ఎంతో ఔదార్యంతో ముందడుగు వేస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో వేలాది మంది సినీ కార్మికులు జీవనోపాది కోల్పోయారు. అంతే కాకుండా చాలా వరకు సినీ రంగంలో వలస కార్మికులు ఎక్కువగా ఉండడంతో వారికి స్థానికి రేషన్ కార్డులు ఉండవు. దాంతో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రాయితీలను కూడా సినిమా కార్మికులు పెద్దగా అందుకోలేరు. దీంతో ఎక్కడ పని ఎక్కువగా ఉంటుందో, ఎక్కడ సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతాయో అక్కడ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుంటారు సిని కార్మికులు.

  Lockdown : Mega Star Chiranjeevi Distributing Food To Cinema Works Through CCC Trust In Hyderabad
  కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఉచిత నత్యావసర సరుకులు.. క్వాలిటీ విషయంలో రాజీ పడని మెగాస్టార్..

  కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఉచిత నత్యావసర సరుకులు.. క్వాలిటీ విషయంలో రాజీ పడని మెగాస్టార్..

  అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్స్ట్ లో ఎన్నో వేల మంది కార్మికులు పని చేస్తుండం జరుగుతుంది. అలాంటి వారికోసం మెగాస్టార్ చిరంజీవి ఓ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆచరణలోకి తీసుకొచ్చారు. చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గాని, నిర్ణయం అమలు పట్ల గానీ పెద్ద ఉత్తున ప్రశంసలు అందుతున్నట్టు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉపాది కోల్పోయిన సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఉచితంగా అందించే సుమారు 18రకాల నిత్యావసర సరుకుల నాణ్యతను చిరంజీవి తనిఖీ చేసిన విధానం పట్ల సినీ పెద్దల నుండి ఔరా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.

  జీవనోపాది కోల్పోయిన వేలాది మంది సినీ కార్మికులు... అక్కున చేర్చుకున్న సైరా..

  జీవనోపాది కోల్పోయిన వేలాది మంది సినీ కార్మికులు... అక్కున చేర్చుకున్న సైరా..

  చిరంజీవి నేతృత్వంలో విజయవంతంగా ముందుకెళ్తున్న కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసన సరుకుల నాణ్యతలో రాజీ పడేది లేదని చెప్పుకొస్తున్నారు సీసీసీ నిర్వహకులు. అంతే కాకుండా పంపిణీ చేస్తున్న సరుకుల నాణ్యతను మెగాస్టార్ స్టార్ చిరంజీవి తనిఖీ చేసిన విధానం పట్ల, కార్మికుల పట్ల ఆయనకున్న చిత్త శుద్ది పట్ల సినీ పెద్దలు మంత్రముగ్దులవుతున్నట్టు తెలుస్తోంది. కార్డికులకు పంపిణి చేసే సరుకుల్లోంచి ఓ సరుకుల ప్యాకేజీని ఇంటికి తప్పించుకుని ప్రత్యక్షంగా వాటి క్వాలిటీని చెక్ చేసారు చిరంజీవి.

  సిని కార్మికులకు అందరివాడుగా మారిన చిరు.. క్లిష్ట సమయంలో ఏ ఒక్కరికీ ఇబ్బందులొద్దంటున్న ఆచార్య..

  సిని కార్మికులకు అందరివాడుగా మారిన చిరు.. క్లిష్ట సమయంలో ఏ ఒక్కరికీ ఇబ్బందులొద్దంటున్న ఆచార్య..

  అంతే కాకుండా సీసీసీ తరుపున ఉచితంగా ఇచ్చే 25 కిలోల బియ్యం బస్తాలోని బియ్యాన్ని కూడా చిరంజీవి వైవిద్యంగా తనిఖీ చేసినట్టు తెలుస్తోంది. అకస్మాత్తుగా గత వారం సీసీసీ తరుపున పంపిణీ చేస్తున్న సరుకుల నుండి ఆకస్మికంగా ఓ బ్యాగ్ ను ఇంటికి తెప్పించుకున్న చిరంజీవి అదే బ్యాగ్ లోని బియ్యాన్ని వండించుకున్నట్టు సమాచారం. సీసీసీ పంపిణీ చేస్తున్న సరకులతో పాటు బియ్యం నాణ్యతను చిరంజీవి ఈ విధంగా చెక్ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.

  సీసీసీ సరుకుల ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని వండించుకున్న మెగాస్టార్..

  సీసీసీ సరుకుల ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని వండించుకున్న మెగాస్టార్..

  అంతే కాకుండా కార్మికులకు పంచే బియ్యాన్ని చిరంజీవి వండించుకుని తిని సంతృప్తి వ్యక్తం చేపిన తర్వాతే క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేయండం అద్బుతమైన అంకితభావంగా సిని వర్గాలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. దేశంతో, తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మెగాస్టార్ గా చిరంజీవి స్పందించే విధానం అత్యద్బుతంగా ఉంటుందనే చర్చ సాగుతోంది. తాజాగా కరోనా క్టిష్ట సమయంలో సినీ కార్మికుల జీవనోపాదికి చిరంజీవి తీసుకున్న నిర్ణయంగాని, ఆచరణలో పెడుతున్న విధానం గాని నభూతో, నభవిష్యతి అనే చర్చ జరుగుతోంది.

  English summary
  The cinema sources seem to have been astonishingly devoted to ordering the workers to take the rice to the field once they are satisfied with the cooked rice. There is talk that Chiranjeevi's response as a megastar is the best in the event of any disaster in Telugu states.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X