• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి...

|

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మోజిగూడెం సమీపంలో లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వేంబ్రిడ్జి వద్ద లారీని రివర్స్ చేస్తుండగా... అది రోడ్డుపైకి రావడంతో... వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. లారీ సడెన్‌గా రోడ్డు పైకి రావడంతో బైక్ ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిట్యాల మండలం పిట్టంపల్లికి చెందిన హరీశ్,హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కి చెందిన మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌పై ముగ్గురు పిట్టంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ముగ్గురు యువకులు ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.మిర్యాలగూడ సమీపంలోని చింతపల్లి హైవే వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్‌ టావెల్స్ బస్సు రోడ్డుపైన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, 10మందికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతులను మల్లికార్జున్(40),నాగేశ్వర్‌రావు(44),గుంటూరు జిల్లాకు చెందిన జయరావ్(42)లుగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 chotuppal road accident three killed on spot after bike and lorry collides

ఇదే నల్గొండ జిల్లాలో ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్-నాగార్జున సాగర్​హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా... మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా పీఏపల్లి మండలం రంగారెడ్డి గూడెంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.

  Joe Biden స్థానాన్ని Kamala Harris భర్తీ చేయనున్నారా ? || Oneindia Telugu

  మార్గమధ్యలో ఓ బొలెరో వాహనం అదుపు తప్పి ఆటో వైపు దూసుకొచ్చింది. దాన్ని తప్పించేందుకు ఆటో డ్రైవర్ మల్లేశం... వాహనాన్ని రోడ్డు మధ్యకు తిప్పాడు.దీంతో అటుగా వస్తున్న లారీ ఆటోను అతివేగంతో ఢీకొట్టింది. దీంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జవగా కూలీలంతా చెల్లాచెదురుగా చెడిపోయి ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. కూలీలంతా మరో అరగంటలో ఇల్లు చేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం అందరినీ కలచివేసింది.ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స​ అందించాలని అధికారులను ఆదేశించారు.

  English summary
  A fatal road accident took place at Choutuppal in Yadadri Bhongir district. Three youths were killed on the spot in a lorry-bike collision near Dharmojigudem. While reversing the lorry at Wembridge ... as it came on the road ... the bike coming from behind collided it.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X