వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రీస్తు బోద‌న‌లు మ‌హిమాన్వితాలు..! జంట‌న‌గ‌రాల్లో మొద‌లైన క్రిష్ట‌మ‌స్ శోభ‌..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని చ‌ర్చిలు ఆద్యాత్మిక‌త‌ను సంత‌రించుకున్నాయి. క్రిష్ట‌మ‌స్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా జంట‌న‌గ‌రాల్లోని చర్చిల‌న్నింటిని అందంగా అలంక‌రించారు. ప్రేమ, కరుణకు ప్రతీక అయిన ఏసు క్రీస్తు పుట్టిన రోజు క్రిస్ మస్ పండుగ‌ను దేశవ్యాప్తంగా క్రైస్తవ భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చ్ ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. క్రీస్తును ఆరాధిస్తూ కళాకారులు పాడుతున్న పాటలతో చర్చిల్లో సందడి కనిపిస్తోంది. క్రిస్ మస్ సంబరాలకు యావ‌త్ దేశం ముస్తాబైంది.

జంట‌న‌గ‌రాల్లో క్రిష్ట‌మ‌స్ శోభ‌..! విద్యుత్ దీపాల‌తో జిగేల్ మంటున్న చ‌ర్చిలు..!

జంట‌న‌గ‌రాల్లో క్రిష్ట‌మ‌స్ శోభ‌..! విద్యుత్ దీపాల‌తో జిగేల్ మంటున్న చ‌ర్చిలు..!

నగరాల్లో, గ్రామాల్లో క్రిస్ మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. శాంటాక్లాజ్ లు, క్రిస్ మస్ ట్రీలతో సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రముఖ చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. క్రిస్ మస్ షాపింగ్ తో మార్కెట్ లు కిటకిటలాడుతున్నాయి. అటు పవిత్ర వారణాసిలో శాంటాక్లాజ్ లు సందడి చేశారు. పాపం చేసిన వాళ్లనూ క్షమించడం క్రీస్తు తత్వంలోని గొప్పదనం. అలాంటి ఏసు క్రీస్తు పుట్టిన రోజే క్రిస్ మస్. త్యాగం, సహనాలే కాదు, ఒకరికొకరు ప్రేమ, కరుణలు పంచాలన్న సందేశాన్ని ఇచ్చే ఈ పండగ దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి.

చ‌ర్చిల్లో ఆద్యాత్మికత‌..! పోటెత్తుతున్న భ‌క్తులు..!!

చ‌ర్చిల్లో ఆద్యాత్మికత‌..! పోటెత్తుతున్న భ‌క్తులు..!!

మహిమాన్వితమైన క్రీస్తు బోధలతో చర్చ్ లలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. చ‌ర్చిల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. చిన్నా పెద్దా అంతా కలిసి క్రిస్ మస్ ప్రేయర్లు చేస్తున్నారు. హైద‌రాబ‌ద్, అమ‌రావ‌తి తేడా లేకుండా క్రిస్ మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎటు చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది. ప్రఖ్యాత మెదక్ చర్చిలో క్రిస్ మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భ‌క్తులు, సంద‌ర్శ‌కుల‌ను ఆకట్టుకునేలా చర్చిల‌ను అందంగా డెకరేట్ చేశారు. దేశవ్యాప్తంగా అర్థరాత్రి నుంచే క్రిస్ మస్ హోలీ ఫీస్ట్ సంబరాలు మొదలయ్యాయి. రంగురంగుల లైట్లతో ప్రత్యేక అలంకరణలతో చర్చిలన్నీ జిగేల్ మంటున్నాయి.

క్ష‌మాగుణానికి మించింది లేదు..! క్రీస్తు బోద‌న‌ల‌తో మారుమోగిపోతున్న చ‌ర్చిలు.!!

క్ష‌మాగుణానికి మించింది లేదు..! క్రీస్తు బోద‌న‌ల‌తో మారుమోగిపోతున్న చ‌ర్చిలు.!!

క్రిస్మస్ అనగానే ప్రతి ఇంటిపై వెలిగే నక్షత్రాలు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతాయి. దాదాపు ప్రతి క్రిస్టియన్ ఇంటిపైనా స్టార్ లను పెడతారు. ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు. రంగురంగుల బెలూన్లు, అలకంరణ వస్తువులతో చర్చిలను డెకరేట్ చేస్తారు. కానీ ప్రతి అలంకరణకు కారణముంది. వేడుకల్లో పరమార్థముంది. యేసు ప్రభువు బెత్లహేంలో జన్మించినప్పుడు జ్ణానులకు దారి చూపించింది నక్షత్రమే. అది దేవుడు ఏర్పాటు చేసిన న‌క్ష‌త్ర‌మ‌ని అని క్రైస్తవుల నమ్మకం. అందుకే ప్రతి ఇంటిపై స్టార్ పెడతారు. తమ ఇంట్లోనూ క్రీస్తు జన్మించాడని సూచికగా స్టార్‌ను వేలాడదీస్తారు.

దేవుడి చూపిన మార్గం గొప్ప‌ది..! ప‌విత్ర పూజ‌ల‌తో బోద‌న‌లు చేస్తున్న మ‌త పెద్ద‌లు..!!

దేవుడి చూపిన మార్గం గొప్ప‌ది..! ప‌విత్ర పూజ‌ల‌తో బోద‌న‌లు చేస్తున్న మ‌త పెద్ద‌లు..!!

ఇక క్రిస్మస్ చెట్టు. స్టార్లు, బెలూన్లు, గ్రీటింగ్ కార్డులతో అందంగా ముస్తాబవుతుంది ట్రీ. దీనికీ ఓ కథ ఉంది. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో తారలు దేదీప్యమానంగా వెలిగాయి. పువ్వులు అందంగా వికసించాయి. పండ్లతో చెట్లు ఫలాలనిచ్చాయి. ప్రక్రుతిలోని ప్రతిదీ పరవశించింది. కానీ క్రిస్మస్ ట్రీ ఏమంత అందంగా ఉండదు. స్టార్ల వెలుగును చూసి, పువ్వుల నవ్వులు చూసి తాను ఏమీ బాలేనని డల్ అయి పోతుందట క్రిస్మస్ చెట్టు. ఆకాశం నుంచి క్రిస్మస్ ట్రీ విచారం చూసిన నక్షత్రాలు చాలా బాధపడ్డాయి. వెంటనే నక్షత్రాలన్నీ చెట్టుపై వాలిపోయాయట. దీంతో అన్నిటికన్న క్రిస్మస్ ట్రీ అందంగా తయారైందని చెప్తుంటారు. అందుకే క్రిష్ట‌మ‌స్ ప‌ర్వ‌దినాల్లో క్రిష్ట‌మ‌స్ చెట్టుకు కూడా మంచి ప్రాధాన్య‌తనిస్తారు క్రైస్త‌వులు.

English summary
The churches in the city have gained spirituality. On the occasion of Christmus, the churches of the twin cities were beautifully decorated.Christ's birthday celebrates the love and mercy of Christ, the celebration of the Chrismas celebration began in the country wide. Special prayers in the church are going a head and congratulating each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X