వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రైస్తవుల ప్రార్థనల వల్లనే సిఎంల మధ్య సయోధ్య: మత్తయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews
Mattaiah

విజయవాడ: క్రైస్తవుల ప్రార్థనలవల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర రావు మధ్య సయోధ్య కుదిరిందని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి, నోటుకు ఓటు కేసులో నిందితుడు జెరూషలేము మత్తయ్య అన్నారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు తీవ్రత పెరిగి రెండు రాష్ట్రాల్లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయని గుర్తు చేశారు. అయితే, తెలుగు ప్రజలు ఊహించని రీతిలో ముఖ్యమంత్రుల మధ్య, టిఆర్ఎస్- టిడిపి శ్రేణుల మధ్య సయోధ్య ఏర్పడిందని అన్నారు.

ఈ ఆశ్చర్యం, అద్భుతం ఏసుక్రీస్తు దైవశక్తి, క్రైస్తవుల ప్రార్థనలతోనే సాధ్యమైందని ప్రజలు గుర్తించాల్సిందిగా జెరూషలేము మత్తయ్య కోరారు.

English summary
Jerusalem Mattaiah said that the compromise betweeem Andhra Pradesh CM Nara Chandrababu Naidu and Telangana CM K Chandrasekhar Rao was the result of Christians prayers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X