వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయాలు ఎలా లీక్ అయ్యాయి?: కంగు తిన్న సీఐఏ.., ఇవాంకా విందు సమయంలోనే..

ద్రతా అంశాలను అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ.. అవెలా బయటకి వచ్చాయన్న దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

GES 2017 : Ivanka Trump Security Details Leaked

హైదరాబాద్: ఓవైపు అమెరికన్ సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్స్‌తో కూడిన అత్యంత టైట్ సెక్యూరిటీ, మరోవైపు సెంట్రల్ ఇంటలిజెన్స్ నిఘా(సీఐఏ).. ఈ రెండింటి సమన్వయంతో ఇవాంకా ట్రంప్ భద్రత పకడ్బంధీగా ప్లాన్ చేశారు.

ఇంత పకడ్బంధీగా ప్లాన్ చేసినప్పటికీ.. ఇవాంకా సెక్యూరిటీ వివరాలు లీక్ అవడం సీఐఏను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలే ఇక్కడి పోలీసులపై నమ్మకం లేని సీఐఏకు ఇప్పుడి సెక్యూరిటీ లీక్ మరింత అపనమ్మకాన్ని పెంచుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 అసలేమైంది?:

అసలేమైంది?:

మంగళవారం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్.. రాత్రి 8గం.కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫలక్‌నుమా డైనింగ్ టేబుల్‌పై ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విందు ఆరగించారు. వంద కన్నా ఎక్కువమంది ఒకేసారి భోజనం చేయడానికి అనువుగా ఉన్న ఈ డైనింగ్ టేబుల్ పై ఇవాంకా ఎక్కడ కూర్చుంటారన్నది సీఐఏ తొలి నుంచి గోప్యంగా ఉంచుతూ వచ్చింది.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భోజనం ఖరీదు రూ.18 వేలు: ఈ హోటల్ అద్భతాలు ఎన్నోఫలక్‌నుమా ప్యాలెస్‌లో భోజనం ఖరీదు రూ.18 వేలు: ఈ హోటల్ అద్భతాలు ఎన్నో

 అయినా లీక్:

అయినా లీక్:

ఫలక్‌నుమాలో విందు జరుగుతున్న సమయంలో స్థానిక మీడియాలో '101వ టేబుల్ పై ఎవరు కూర్చున్నారు?.. ప్యాలెస్ లోని ఇతర వీవీఐపీలు, వారి భద్రతకు సంబంధించిన సీసీటివి ఫుటేజీ' విషయాలు బయటకు లీక్ అయ్యాయి. పలు టీవి ఛానెల్స్ వీటిని ప్రసారం చేయడంతో భద్రతా అధికారులు కంగు తిన్నారు. భద్రతా అంశాలను అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ.. అవెలా బయటకి వచ్చాయన్న దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది:

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది:

ఫలక్‌నుమా విందు సందర్భంగా భద్రతా విషయాలు మీడియాకు లీక్ అవడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇవాంకా ట్రంప్ రెండో రోజు షెడ్యూల్‌పై మరింత ఫోకస్ పెట్టారు. రెండో రోజు సదస్సులో పాల్గొన్న తర్వాత.. ఆమె తదుపరి కార్యక్రమాల గురించి షెడ్యూల్‌లో పేర్కొనలేదు. ఇవాంకా ఒకవేళ షాపింగ్ లేదా హైదరాబాద్ లోని ఇతర స్పాట్స్ చూడటానికి వెళ్లాలనుకుంటే.. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు.

 రెండో రోజు గ్లోబల్ సమ్మిట్:

రెండో రోజు గ్లోబల్ సమ్మిట్:

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండో రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు 'వుమెన్ ఫస్ట్, ప్రాస్పరిటీ ఫర్ ఆల్' అనే అంశంపై సదస్సు నిర్వహించగా.. రెండో రోజు 'ఇన్నోవేషన్స్‌ ఆన్‌ వర్క్‌ఫోర్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌' అనే అంశంపై చర్చాగోష్ఠితో ప్లీనరీ సెషన్‌ మొదలైంది. సెషన్ లో భాగంగా ఐటీ మంత్రి కేటీఆర్ మోడరేటర్‌గా వ్యవహరించి ఇవాంకా ట్రంప్ ను పలు అంశాలపై ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

English summary
American Intelligence officials shocked after security details leak during the dinner of ivanka trump in falaknuma palace
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X