వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి అరుదైన గుర్తింపు, 13వ స్థానంలో తెలంగాణ: ప్రపంచ బ్యాంక్ ర్యాంక్‌లివీ...

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు భారత దేశంలో వ్యాపారానికి అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో గుజరాత్ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవగా... మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది.

తొలి అయిదు స్థానాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది.

ఈ జాబితాను ప్రపంచ బ్యాంక్ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విడుదల చేసింది. ఈ జాబితాలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి.

CII, World Bank report: Gujarat ranked as the most business friendly state, AP in second

వ్యాపార అనుకూల జాబితాలో గుజరాత్ 71.14 శాతంతో మొదటి స్థానంలో, ఏపీ 70.12 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ 42.45 శాతంతో 13వ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కేరళ, అస్సా, ఉత్తరాఖండ్‌లు.... 19, 22, 23వ స్థానాల్లో నిలిచాయి. కర్నాటక మాత్రం 9వ స్థానంలో నిలిచింది.

వ్యాపార అనుకూల రాష్ట్రాల జాబితా వరుసగా..

గుజరాత్ - 1
ఆంధ్రప్రదేశ్ - 2
జార్ఖండ్ - 3
చత్తీస్‌గఢ్ - 4
మధ్యప్రదేశ్ - 5
రాజస్థాన్ - 6
ఒడిశా - 7
మహారాష్ట్ర - 8
కర్నాటక - 9
ఉత్తర ప్రదేశ్ - 10
పశ్చిమ బెంగాల్ - 11
తమిళనాడు - 12
తెలంగాణ - 13
హర్యానా - 14
ఢిల్లీ - 15
పంజాబ్ - 16
హిమాచల్ ప్రదేశ్ - 17
కేరళ - 18
గోవా - 19
పుదుచ్చేరి - 20
బీహార్ - 21
అసోం - 22
ఉత్తరాఖండ్ - 23
చండీగఢ్ - 24
అండమాన్ నికోబర్ దీవులు - 25
త్రిపుర - 26
సిక్కిం - 27
మిజోరాం - 28
జమ్ము కాశ్మీర్ - 29
మేఘాలయ - 30
నాగాలాండ్ 31
అరుణాల్ ప్రదేశ్ - 32

CII, World Bank report: Gujarat ranked as the most business friendly state, AP in second

చంద్రబాబు హర్షం

ప్రపంచ బ్యాంక్ నివేదిక పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ నివేదికకు ప్రపంచ బ్యాంక్ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంది. వ్యాపార సంస్థలు, భూకేటాయింపు, పర్యావరణ విధానాలు, కార్మిక సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన, తనిఖీలు, పన్నుల విధానం, నిర్మాణ అనుమతులు, కంపెనీల నమోదు - నియంత్రణ తదితరాలను పరిగణలోకి తీసుకుంది.

English summary
CII, World Bank report: Gujarat ranked as the most business friendly state; BJP-ruled states feature at top
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X