వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచి థియేటర్లు,మల్టిప్లెక్సుల రీఓపెన్... ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి...నేటి నుంచి థియేటర్లు,

|
Google Oneindia TeluguNews

అన్‌లాక్ 5.0లో భాగంగా గురువారం(అక్టోబర్ 15) నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు,మల్టీప్లెక్సులు రీఓపెన్ కానున్నాయి. దాదాపు 8 నెలల తర్వాత థియేటర్లు రీఓపెన్ అవుతున్నాయి.కేంద్రం నిబంధనల ప్రకారం కేవలం 50శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు,మల్టిపెక్సులను నడపాల్సి ఉంటుంది. అలాగే కనీసం ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా థియేటర్ లోపల సీట్ల ఏర్పాటు ఉండాలి. ఫేస్ మాస్కులు ధరించినవారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. థియేటర్,మల్టిప్లెక్స్ పరిసరాల్లో ఉమ్మివేయడం నిషేధం.

 ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్ లైన్స్ విడుదల... ఈ నిబంధనలు పాటించాల్సిందే... ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్ లైన్స్ విడుదల... ఈ నిబంధనలు పాటించాల్సిందే...

థియేటర్,మల్టిప్లెక్స్ ప్రవేశ మార్గాల వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. ఎలాంటి కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ప్రతీ ఎంట్రీ పాయింట్ వద్ద హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. లాబీలు,వాష్ రూమ్స్ తదితర ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జనం ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రాకుండా మూవీ షో టైమింగ్స్‌లో కాస్త గ్యాప్ పాటించాలి. అలాగే ప్రతీ 'షో' తర్వాత థియేటర్,మల్టిప్లెక్సులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి.

Cinema halls multiplexes will reopen across the country from today

బాక్స్ ఆఫీస్ వద్ద జనం గుమిగూడకుండా రోజు మొత్తం టికెట్ కౌంటర్లు ఓపెన్ చేసి ఉంచాలి. సినిమాకి ముందు లేదా ఇంటర్వెల్ సమయంలో కరోనాపై అవగాన కల్పించే విధంగా నిమిషం నిడివితో ఉన్న ప్రకటనను తెరపై ప్రదర్శించాలి. ప్యాకేజీ ఆహార పానీయాలు మాత్రమే అనుమతించాల్సి ఉంటుంది. అలాగే, ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిగా వాడాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. అన్‌లాక్ 5 మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్ల వెలుపల మాత్రమే థియేటర్లు,మల్టీప్లెక్సులకు అనుమతి ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లలో ఉండేవాటికి అనుమతి లేదు.

Recommended Video

#HBDAmitabhBachchan : మీరే మా గురువు.. బిగ్ బి కు చిరు, ప్రభాస్, మహేష్ స్పెషల్ బర్త్ డే విషెస్!

English summary
Cinema halls, theatres and multiplexes are reopening from tomorrow, October 15, 2020, in the country with only 50 per cent seating capacity. However, the exhibition of films will not be allowed in containment zones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X