వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సినిమా హీరో

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పూటుగా మద్యం సేవించి, ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు ఓ సినిమా హీరో. కాయ్ రాజా కాయ్ అనే సినిమాలో హీరోగా నటించిన సాయి రోహిత్ మద్యం సేవించటి వాహనం నడుపుతుండగా శనివారం అర్ధరాత్రి పోలీసులకు చిక్కాడు.

నగరంలోని జూబ్లీహిల్స్‌ పరిధిలో పోలీసులు శనివారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా రోడ్ల పైన వెల్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న పలువురిని గుర్తించి వారి వాహనాలను సీజ్ చేశారు.

Drunk And Drive

మొత్తం పదమూడు వాహనాలను సీజ్ చేశారు. ఇందులో సాయి రోహిత్‌ కూడా పోలీసులకు దొరికాడు. పోలీసులు అతని కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి శనివారం రాత్రి నగరంలోని ఆయా ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తుంటారు. వీకెండ్ పార్టీల పేరుతో కొందరు ప్రముఖుల పిల్లలతోపాటు సెలబ్రిటీలు పబ్బులు, రిసార్ట్‌లలో జల్సాలు చేసుకుని వస్తుంటారు.

ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురైన సందర్బాలూ ఉన్నాయి. అలాగే, రోడ్డుపై వెళుతున్న వారికి ఇబ్బందులు కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతి శనివారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. పోలీసులు రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒకటి గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

English summary
Telugu Cinema Hero caught in Drunk and Drive in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X