హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీఎస్టీ ఎఫెక్ట్: సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్

ఇటీవల పెంచిన సినిమా టికెట్ల ధరలను తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇందుకు సంబంధించి వారం రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్‌: ఇటీవల పెంచిన సినిమా టికెట్ల ధరలను తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇందుకు సంబంధించి వారం రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేదీ నేతృత్వంలోని కమిటీ సినిమా థియేటర్లలో టికెట్ల ధర పెంపునకు సంబంధించి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ధర పెంచుతూ హోంశాఖ వారం రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

Cinema ticket price hike put on hold

అయితే, జులై 1 నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) అమలవుతుండటంతో పాటు సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న ఒత్తిడి, ఇతర అంశాల దృష్ట్యా ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని కేటగిరీ థియేటర్లలో పెంచిన ధరలు కూడా ఇందుకు ఓ కారణమని తెలుస్తోంది.

తాజా నిర్ణయంతో టికెట్ల ధరలను పెంచుతూ జూన్ 23న జారీ చేసిన జీవో నెం. 75 అమలు నిలిచిపోయింది. ఉత్తర్వులను నిలుపుదల చేసి సంబంధిత దస్త్రాన్ని ముఖ్యమంత్రి పరిశీలనకు పంపాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినట్లు సమాచారం.

English summary
The Telangana government on Friday put in abeyance the orders to hike the rates of cinema tickets following objections from the film industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X