వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో ఏంటా వాడకం..! కరెంట్ కే షాక్ ఇస్తున్న నగర వాసులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : వామ్మో.. నగరంలో విద్యుత్ ను నీళ్ల కన్నా ఘోరంగా వాడేస్తున్నారు. నగరంలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది. సూర్య ప్రతాపానికి 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతున్నాయి. గ్రేటర్‌లో గురువారం అత్యధికంగా 3391 మెగావాట్ల రికార్డు స్థాయి గరిష్ఠ డిమాండ్‌ నమోదయ్యింది. బుదవారం 3324 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో పాటు 71.05 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం రికార్డయ్యింది.

గ్రేటర్‌లో విద్యుత్‌ వినియోగం 71.05 ఎంయూలు..! అవాక్కవుతున్న అదికారులు..!!

గ్రేటర్‌లో విద్యుత్‌ వినియోగం 71.05 ఎంయూలు..! అవాక్కవుతున్న అదికారులు..!!

టీఎస్ఎస్పీడీసీఎల్‌ గ్రేటర్‌ జోన్‌ పరిధిలో ఇప్పటి వరకు ఆల్‌టైం రికార్డుగా 71.05 ఎంయూల విద్యుత్‌ వినియోగం ఈ సంవత్సరం మే 28న నమోదయ్యిందని విద్యుత్‌శాఖ అధికారులు ప్రకటించారు. గ్రేటర్‌లో 3500 మెగావాట్ల డిమాండ్‌ను సైతం ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నట్లు డిస్కం ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో గ్రేటర్‌లో గరిష్ఠ డిమాండ్‌ 2216 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 3391 మెగావాట్లకు విద్యుత్‌ డిమాండ్‌ చేరుకుంది.

రికార్డుస్థాయి విద్యుత్‌ వాడకం..! భరించలేని ఉక్కపోతే కారణం..!!

రికార్డుస్థాయి విద్యుత్‌ వాడకం..! భరించలేని ఉక్కపోతే కారణం..!!

నగరవాసులు మే నెలలో రికార్డుస్థాయిలో విద్యుత్‌ వాడేస్తున్నారు. ఎండల నేపథ్యంలో ఓక్కొ ఇంట్లో రెండు కూలర్లు, ఏసీలు వినియోస్తుండడంతో మే నెలల్లో రికార్డుస్థాయిలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. కూలర్‌కు 200-300, ఏసీకి 1500-2000 వాట్స్‌ విద్యుత్‌ ఖర్చువుతోంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్‌ వినియోగం రెట్టింపయ్యింది.

గురువారం 3391 మెగావాట్ల వినియోగం..! రెట్టింపు స్థాయిలో విద్యుత్‌వాడకం..!!

గురువారం 3391 మెగావాట్ల వినియోగం..! రెట్టింపు స్థాయిలో విద్యుత్‌వాడకం..!!

అధిక ఉష్ణోగ్రతలు నేపథ్యంలో గృహాలు, ఆఫీసుల్లో ఏసీలు, కూలర్ల వాడకం బాగా పెరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో లోడ్‌ అమాంతంగా పెరిగి... పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. లోడ్‌ దెబ్బకు ఫీడర్లు ట్రిప్పవడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు నమోదవుతున్నాయి. సబ్‌స్టేషన్లలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు హీటెక్కకుండా ఉండేలా ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేశారు.

సబ్‌స్టేషన్లలో ఓవర్‌లోడ్‌..! సరఫరాలో అంతరాయాలు..!!

సబ్‌స్టేషన్లలో ఓవర్‌లోడ్‌..! సరఫరాలో అంతరాయాలు..!!

విద్యుత్‌ డిమాండ్‌ రెట్టింపుస్థాయిలో పెరగడంతో పాటు సబ్‌స్టేషన్లపై ఓవర్‌ లోడ్‌ పడుతోంది. ఓవర్‌ లోడ్‌తో పలు ప్రాంతాల్లో రాత్రిళ్లు తరుచూ విద్యుత్‌ అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 10-15 నిమిషాల పాటు తరుచూ విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తుతుండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

English summary
Record power consumption in the city 24 hours for sunshine, fans, ACs and coolers. On Thursday, the maximum demand was recorded at 3391 MW.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X