వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకాకు షాక్: అందుకే బేగంపేటకు, మూడు మైన్ ప్రూప్ వాహనాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ టూర్ తెలంగాణ పోలీసు శాఖకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇవాంకా ట్రంప్ సెక్యూరిటీ అధికారులు ఏ క్షణంలో ఏ రకమైన ఆదేశాలు ఇస్తారోననే ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్‌కు చేరుకొనే సమయంలో సుమారు ఐదు గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అనుమతించకూడదని అమెరికా భద్రతాధికారులు శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు లేఖ రాసినట్టు సమాచారం.

Recommended Video

Ivanka Trump Visit : వైట్ హౌస్ నుంచి పర్యవేక్షణ, కనీవిని ఎరుగని సెక్యూరిటీ | Oneindia Telugu

ఇవాంకా టూర్: రంగంలోకి 'జేమ్స్‌బాండ్‌‌లు', మహిళా ఐపిఎస్ అధికారి రక్షణఇవాంకా టూర్: రంగంలోకి 'జేమ్స్‌బాండ్‌‌లు', మహిళా ఐపిఎస్ అధికారి రక్షణ

నవంబర్ 28వ, తేదిన హైద్రాబాద్‌లో జరిగే జీఈఎస్ 2017 సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొంటారు. అయితే ఇవాంకా ట్రంప్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి.

అమెరికాకు చెందిన రక్షణ అధికారులు ఇప్పటికే ఇవాంకా పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఇవాంకా ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశారు. ఇవాంకా ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో అమెరికా అధికారుల సూచనల మేరకు బందోబస్తును ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసులు.

 5 గంటల పాటు విమానాలు ఆపండి

5 గంటల పాటు విమానాలు ఆపండి

ఇవాంకా ట్రంప్‌ విమానం ల్యాండ్‌ అవడానికి ముందు , ఆ తర్వాత సుమారు 5 గంటల పాటు ఇతర విమానాలను శంషాబాద్‌ విమానాశ్రయంలోకి అనుమతించవద్దంటూ అమెరికా సెక్యూరిటీ అధికారులు ఈ మేరకు శంషాబాద్‌ విమానాశ్రయ యాజమాన్యానికి లేఖ రాసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ లేఖపై అమెరికా అధికారులకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు కూడ ఘాటుగానే సమాధానమిచ్చారని సమాచారం.షెడ్యూల్‌ ప్రకారం ఉన్న విమానాలను నిలిపివేయడం కుదరదని తేల్చి చెప్పారని సమాచారం.

బేగంపేటకు మారిన ఇవాంకా విమానం ల్యాండింగ్

బేగంపేటకు మారిన ఇవాంకా విమానం ల్యాండింగ్

శంషాబాద్‌లో 5 గంటల పాటు విమానాలు నిలిపివేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పడంతో పాటు శంషాబాద్ విమానాశ్రయం కూడ ఇవాంకా ట్రంప్ భద్రతకు అత్యంత సురక్షితమైంది కాదని ఇంటలిజెన్స్ అధికారులు సూచించారు. దీంతో ఇవాంకా ట్రంప్ ప్రయాణం చేసే విమానం బేగంపేట విమానాశ్రయంలో దిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 మూడు మైన్ రెసిస్టెంట్స్ వాహనాలు

మూడు మైన్ రెసిస్టెంట్స్ వాహనాలు

ఇవాంకా ట్రంప్ భద్రత కోసం అమెరికా అదికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇవాంకా చుట్టూ అమెరికా అధికారులు ఉంటారు.ఎనిమిది మీటర్ల మేర అమెరికా పోలీసుల భద్రత వలయంలో ఇవాంకా ట్రంప్ ఉంటారు.ఇవాంకా వస్తున్న ప్రత్యేక విమానంలోనే మూడు మైన్‌ రెసిస్టెంట్స్‌ వెహికిల్స్‌ (ఎంఆర్‌వీ) వస్తున్నాయి. ఆ వాహనాల్లోనే ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. వీటిలో ఆధునాతన జామర్లు, ఇతర ఆధునిక పరికరాలు ఉన్నాయి.

ఇవాంకా కోసం అమెరికా రక్షణ ఏర్పాట్లు

ఇవాంకా కోసం అమెరికా రక్షణ ఏర్పాట్లు

హైద్రాబాద్‌లో ఇవాంకా ట్రంప్ గడిపే సమయంలో అమెరికా రక్షణ అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. అమెరికా రక్షణ అధికారుల సూచనల మేరకే తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాంకా బస చేసే హోటల్‌ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడ అనుమతించడం లేదు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అమెరికన్ రక్షణ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ హోటల్ బయట తెలంగాణ పోలీసులు పహరా కాస్తున్నారు. ఇవాంకా కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుండి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ఇవాంకాతో పాటు అతిథులను తీసుకువచ్చేలా పోలీసులు రూట్‌మ్యాప్‌ను తయారు చేశారు.

English summary
Prime Minister Narendra Modi and US President’s daughter Ivanka Trump will travel by road from Hyderabad International Convention Centre (HICC), venue for Global Entrep
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X