వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ దేశం ఉత్తరాది సొత్తు కాదు: ఆర్ నారాయణ మూర్తి, కేసీఆర్‌కు ఇంటాబయటా మద్దతు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఇంటా, బయట మద్దతు లభిస్తోంది. తనకు అవకాశం వస్తే జాతీయ రాజకీయాలు మార్చేస్తానని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.

చదవండి: మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్

ఆయనకు తెలుగు రాష్ట్రాలలో పలువురు ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా పలువురు ఇతర రాష్ట్రాల నాయకులు కూడా ఆయనను వెనుకేసుకొస్తున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్‌లు ఆయనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారు.

చదవండి: 7 రేస్ కోర్స్ రోడ్డు: కేసీఆర్ ప్రధానమంత్రి పదవిపై కన్నేశారా, చంద్రబాబుతో పోటీనా?

మమతా బెనర్జీ ఏమన్నారంటే

మమతా బెనర్జీ ఏమన్నారంటే

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని, ఆయనతో పని చేస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్లు బెంగాల్ సీఎం కార్యాలయం తెలిపింది. తనకు మమత ఫోన్ చేసిందని కేసీఆర్ కూడా చెప్పిన విషయం తెలిసిందే.

కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

తన మద్దతు ఉంటుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఎదుర్కోలేదని, థర్డ్ ఫ్రంట్ రావాలని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అలాగే మహారాష్ట్ర ఎంపీలు కూడా కేసీఆర్‌కు మద్దతు పలికారు.

పవన్ కళ్యాణ్ మద్దతు

పవన్ కళ్యాణ్ మద్దతు

కేసీఆర్ నిర్ణయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. తమ ఇద్దరి భావజాలం ఒక్కటేనని, హోదాపై కేసీఆర్ వ్యాఖ్యలు కొండంత బలం ఇచ్చాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఉత్తర భారతీయుల సొత్తు కాదు

ఉత్తర భారతీయుల సొత్తు కాదు

కేసీఆర్ నిర్ణయానికి ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి కూడా మద్దతు పలికారు. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన ఏపీకి హోదాపై తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. ఈ దేశం ఉత్తర భారతీయుల సొత్తు కాదన్నారు.

చైనా, జపాన్‌లా అభివృద్ధి చెందాలంటే

చైనా, జపాన్‌లా అభివృద్ధి చెందాలంటే

చైనా, జపాన్‌లా భారత దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి దూరదృష్టి గల నాయకుడు అవసరమని ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు అని, దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, అందుకు ప్రత్యామ్నాయం కావాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.

English summary
Trinamool Congress chief Mamata Banerjee and former Jharkhand chief minister Hemant Soren have now backed TRS chief K Chandrashekhar Rao's (KCR) call for forming a third front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X