హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విక్రమ్ కేసులో వీడిన మిస్టరీ, ఎందుకు చేశాడంటే: 'గన్' లైసెన్స్ ట్విస్ట్

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కేసులో మిస్టరీ వీడింది. విక్రంను కాల్చి చంపిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ముగ్గురిని కర్నాటకలో అదుపులోకి తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కేసులో మిస్టరీ వీడింది. విక్రంను కాల్చి చంపిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ముగ్గురిని కర్నాటకలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రాజు, రాజశేఖర్, మురళీలుగా గుర్తించారు. వీరితో తనపై కాల్పులు జరిపేందుకు విక్రమ్ ఒప్పందం చేసుకున్నారు.

ఈ ముగ్గురు నిందితులు కూడా విక్రంకు పరిచయస్తులేనని పోలీసులు తేల్చారు. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకొని, హైదరాబాద్ తరలిస్తున్నారు. విక్రమ్ గౌడ్‌పై కాల్పులకేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

హత్యాయత్నంగా మార్చేందుకు విక్రమ్ గౌడ్ వ్యూహం

హత్యాయత్నంగా మార్చేందుకు విక్రమ్ గౌడ్ వ్యూహం

అంతకుముందు, విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేసి దాన్ని హత్యాయత్నంగా మార్చేందుకు పథకం వేసినట్లు పోలీసులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించారు. వీరు విక్రమ్ సూచనల మేరకే బైక్‌ను తీసుకు వచ్చి అతని ఇంటి బయట తచ్చాడి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా పారిపోయినట్లు గుర్తించారు.

పోలీసులకు ఎన్నో అనుమానాలు

పోలీసులకు ఎన్నో అనుమానాలు

ఇదంతా విక్రమ్ గౌడ్‌ ఎందుకు చేశాడన్నదానిపై ఆధారాలు లభించకపోవడంతో మరోసారి అతనిని ప్రశ్నించారు. అతని ఫోన్‌లోని నంబర్లు, మెసేజ్‌లు పరిశీలించిన తర్వాత పోలీసులకు కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. వీటిని నివృత్తి చేసుకోవడానికి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో మాయమైన తుపాకి కోసం గాలించారు. దానిని గుర్తించారు.

ఇదీ విక్రం వాదన

ఇదీ విక్రం వాదన

విక్రమ్ గౌడ్‌, అతని భార్య షిపాలి నుంచి పోలీసులు పలు వివరాలను సేకరించారు. సాంకేతిక సాక్ష్యాధారాలతో విక్రమ్ ఇంట్లోకి ఎవరూ రాలేదని పోలీసులు నిర్ధరించుకున్నారు. అతనే ఆయుధంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. విక్రమ్‌ మాత్రం బయటి నుంచి వచ్చిన దుండగులు తనను కాల్చారని చెబుతున్నాడు.

విక్రమ్ ఇదంతా ఎందుకు చేశాడంటే..

విక్రమ్ ఇదంతా ఎందుకు చేశాడంటే..

ఫోన్ కాల్స్‌, కాపలాదారు చెప్పిన సాక్ష్యాల ఆధారంగా విక్రమ్‌ సంఘటన జరిగిన రోజు అరగంట పాటు బయటకు వెళ్లారని గుర్తించారు. తలుపు వేయవద్దంటూ విక్రమ్‌ తనకు చెప్పినట్లు సెక్యూరిటీ గార్డు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. విక్రమ్ ఇదంతా ఎందుకు చేశాడని ఆరా తీయగా... రూ.కోట్లలో ఉన్న అప్పులను తీర్చేందుకు కుటుంబ సభ్యుల నుంచి సహాయనిరాకరణ ఎదురవడంతో ఇలా చేసుంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆయుధం కోసమా.. కొత్త ట్విస్ట్

ఆయుధం కోసమా.. కొత్త ట్విస్ట్

కుటుంబ సభ్యులను బెదిరించేందుకు ఇలా చేశాడా? తన ప్రాణానికి రక్షణ లేదు... ఆయుధ లైసెన్సు అవసరమంటూ పోలీస్ శాఖ నుంచి సానుభూతి పొందేందుకు పథకం వేశాడా? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరక లేదని అంటున్నారు.

English summary
Three days after Congress leader Vikram Goud suffered gunshot wounds in Telangana, Now clarity on firing incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X