వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయరాం హత్యకేసులో శిఖాకు క్లీన్ చిట్ .. ఏపీ పోలీసులు చెప్పిందే తెలంగాణా పోలీసులు చెప్పారుగా

|
Google Oneindia TeluguNews

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో శిఖా చౌదరి పాత్ర లేదని తెలంగాణా పోలీసులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో తెలంగాణా పోలీసులు ఏపీ పోలీసులు చెప్పిందే చెప్పారు. శిఖా చౌదరి కి ఈ హత్యతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు.

రాకేశ్ రెడ్డితో అధికారుల, రాజకీయ నాయకుల లింకులపై విచారణ

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి పోలీసులతో పాటు పలువురు రాజకీయ నాయకులతో సంబంధమున్న మాట వాస్తమేనని పోలీసులు తెలిపారు. అయితే క్రిమినల్స్ తో పోలీసులు సంబంధాలు కలిగివుండటం మంచిదికాదన్న ఉద్దేశంతో వారి పాత్రపై ముందుగా విచారణ జరిపినట్లు తెలిపారు. అలాగే రాజకీయ నాయకుల పాత్రపై విచారణ జరిపామని వారి ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదన్నారు. అందువల్లే అతడితో సంబంధమున్న నాయకుల పేర్లను కూడా బయటపెట్టలేకపోతున్నామని తెలిపారు.

clean chit to Shikha in Jayaram murder case .. As AP police said Telangana police said the same

జయరాం భార్య ఫిర్యాదుతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు మృతుడు జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై తమకు ఎలాంటి ఆధారాలు, సమాచారం లభించలేదన్నారు. కానీ జయరామ్ భార్య మాత్రం ఆమెపైనే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తుండటంతో మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 90 శాతం విచారణ పూర్తయ్యిందని... ఇంతవరకు శిఖాకు ఈ హత్యలో ఎలాంటి పాత్ర వున్నట్లు బయటపడలేదన్నారు.

ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేశాం .. శిఖా పాత్ర లేదు .. తెలంగాణా పోలీసుల వెల్లడి

తాజాగా ఈ హత్యలో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. టాలీవుడ్ యాక్టర్ సూర్య, అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డిలను అరెస్ట్ చేశామన్నారు. సూర్య, కిషోర్ లకు రాకేశ్ రెడ్డికి 6 నెలలుగా పరిచయం వున్నట్లు...వీరి ద్వారానే జయరామ్ ను మభ్యపెట్టి తన ఇంటికి రప్పించుకునేవాడని తెలిపారు. హత్య జరిగిన రోజు కూడా వీరిద్దరే జయరామ్ ను రాకేశ్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా హత్య గురించి తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందిచపోవడం నేరమే కాబట్టి వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తానికి శిఖా చౌదరి కి ఈ హత్యలో ఎలాంటి ప్రమేయం లేదని తెలంగాణా పోలీసులు సైతం చెప్పటం శిఖా చౌదరి కి కాస్త ఊరట నిచ్చినట్టే .

English summary
Granting a clean chit to Shikha Choudhary in connection with businessman Chigurupati Jayaram murder case, the West Zone Deputy Commissioner of Police (DCP) A R Srinivas on Thursday said that the key accused Rakesh Reddy had relations with politicians and also police. The Jubilee Hills police arrested three more persons -- real estate businessman Anji Reddy, Tollywood small-screen actor Surya Prasad and his assistant Kishor for their alleged hand in Jayaram’s murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X