వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాస్వామ్యాన్ని కాపాడండీ.... అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నిరసన, ధర్నా...!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు ఆందోళనబాట పట్టారు. ఈనేపథ్యంలోనే ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కతో పాటు, మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడంటూ వారు నినాదాలు చేశారు.అయితే అసెంబ్లీలో ఉన్న గాంధీ అంబేద్కర్ విగ్రహాల ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేసేందుకు అసెంబ్లీ సెక్యూరిటి సిబ్బంది అనుమతిని ఇవ్వకపోవడంతో అసెంబ్లీ ముందు నల్ల రిబ్బన్లు ధరించి బైఠాయించారు.

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో టీఆర్ఎస్‌లో చేరిన వారి సంఖ్య 12కు చేరింది. దీంతో మూడింటిలో రెండువంతుల మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు స్పికర్‌కు లేఖ ఇచ్చిన నేపథ్యంలోనే వారు ఆందోళన బాట పట్టారు. కాగా పందోమ్మిది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఏల్‌వోపీగా ఎన్నికయ్యారు.

clp leader bhatti and other mlas protest dharna for save democracy

అయితే ఇదివరకే వీలీనానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలో వీలీనం చేయడం రాజ్యంగ విరుద్దమని వారు వాదిస్తున్నారు. వీలీనం పై జాతీయ కాంగ్రెస్ లేఖ ఇవ్వకుండా సాంకేతికంగా చెల్లదని వారు చెబుతున్నారు.

English summary
congress legislature party leader Bhatti Vikramarka,and former minister Manthani MLA Sridhar Babu along with party cader protest dharna for save democracy sitting in front of gahandi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X